Canada: కెనడాలో హిందువుల భద్రతపై ఇండియన్ మిషన్ ఆందోళన
- కెనడాలో మరోసారి హిందూ భక్తులపై దాడి..
- ఖలిస్థానీ మద్దతుదారుల తీరుపై ఇండియన్ మిషన్ ఆగ్రహం..
- కెనడాలో హిందువుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఇండియన్ మిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: కెనడాలోని బ్రాంప్టన్‌లో గల ఆలయం వెలుపల హిందూ భక్తులపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి చేశారు. ఖలిస్థానీ మద్దతుదారుల తీరుపై ఒట్టావాలోని ఇండియన్ మిషన్ తీవ్రంగా మండిపడింది. ఈ సందర్భంగా హిందువుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులకు అత్యవసర సేవలు అందకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శలు చేసింది. కాగా, కెనడాలోని ఖలిస్థానీ తీవ్రవాదులు హద్దులు దాటిపోయారని కెనడా పార్లమెంటులో భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆచార్య తెలిపారు. హిందూ భక్తులపై జరిగిన దాడి.. కెనడాలో ఖలిస్థానీ హింసాత్మక తీవ్రవాదం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుందన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులు అనేక దుశ్చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు.
Read Also: Tapsee : అలాంటి మాటలతో ప్రతీ రోజు పోరాటమే చేస్తున్న : తాప్సీ
Also Read
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
- Aleksandar Vucic Resigns: సెర్బియాలో కీలక రాజకీయ పరిణామం.. అధ్యక్ష పదవికి వుసిచ్ రాజీనామా
- Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
అయితే, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఖలిస్థానీ మద్దతుదారుల బృందం ప్రదర్శన చేస్తున్నట్లు నివేదికలు వచ్చాయి. ఈ సందర్భంగానే కొందరు హిందూ ఆలయం బయట ఉన్న భక్తులపై దాడి చేశారు. ఈ ఘటనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. హింసాత్మక ఘటన ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రతి కెనడియన్‌కు తమకు నచ్చిన మతాన్ని కొనసాగించే హక్కు ఉందని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ప్రాంతీయ పోలీసులను ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు, హింసాత్మక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. దోషులుగా తేలిన వారిని చట్టం ప్రకారం శిక్షిస్తామని జస్టిన్ ట్రూడ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!