Site icon NTV Telugu

India-US: భారత్-అమెరికా మధ్య కీలక రక్షణ ఒప్పందం

Indiaus

Indiaus

భారత్-అమెరికా మధ్య కీలక రక్షణ ఒప్పందం జరిగింది. దశాబ్ద కాలం నాటి రక్షణ చట్టానికి భారతదేశం అమెరికా సంతకం చేశాయి. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. 10 ఏళ్ల పాటు ఉండే ఈ ఒప్పందం ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, భద్రతా సహకారాన్ని బలోపేతం చేయనుంది.

ఇది కూడా చదవండి: JD Vance-Erika kirk: ఎరికా కిర్క్‌ను కౌగిలించుకున్న జేడీ వాన్స్.. ఇంటర్నెట్ షేక్

మలేసియా వేదికగా ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆసియాన్‌ రక్షణ మంత్రుల సమావేశం జరిగింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, అమెరికా రక్షణ కార్యదర్శి పీట్‌ హెగ్సెత్‌లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రక్షణ ఒప్పందంపై ఇరువురు సంతకాలు చేశారు. 10 ఏళ్ల రక్షణ ఒప్పందంపై సంతకం చేసేందుకు రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ కావడం సంతోషంగా ఉందని పీట్‌ హెగ్సెత్‌ తెలిపారు. ఈ ఒప్పందం ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తుందని అభిప్రాయపడ్డారు. సమన్వయం, సమాచారంతో పాటు సహకారాన్ని పెంచుకుంటామని.. మా రక్షణ సంబంధాలు మరింత బలంగా ఉంటాయని పీట్‌ హెగ్సెత్‌ చెప్పారు.

ఇది కూడా చదవండి: Supreme Court: చీఫ్ సెక్రటరీలు ఫిజికల్‌గా హాజరు కావాల్సిందే.. వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు ఆదేశాలు

Exit mobile version