Site icon NTV Telugu

UK-India: నేడు యూకేతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోనున్న భారత్

Ukindia

Ukindia

ప్రధాని మోడీ రెండు దేశాల పర్యటన కోసం బుధవారం లండన్‌ చేరుకున్నారు. గురువారం యూకేతో భారత్ కీలక ఒప్పందం జరగనుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి. వాణిజ్యం, ఆరోగ్యం, ఇంధనం, విద్య, భద్రత వంటి అంశాలపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో మోడీ చర్చలు జరపనున్నారు. అనంతరం సంతకాలు జరగనున్నాయి.

ఇది కూడా చదవండి: Rakul Preet : ఓ వైపు వర్షాలు.. రకుల్ అందాల సోయగాలు..

ప్రధాని మోడీతో వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ కూడా ఉన్నారు. మూడు సంవత్సరాల చర్చల తర్వాత మే 6న రెండు దేశాలు వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ముగిసినట్లు ప్రకటించాయి. 2030 నాటికి రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 120 బిలియన్ డాలర్లకు చేర్చే ప్రయత్నంలో బ్రిటన్ నుంచి విస్కీ, కార్ల దిగుమతులను చౌకగా చేస్తూ…తోలు, పాదరక్షలు మరియు దుస్తులతో కూడిన ఉత్పత్తుల ఎగుమతిపై పన్నులను తొలగించాలని వాణిజ్య ఒప్పందం జరిగింది.

ఇది కూడా చదవండి: HHVM : సంధ్య థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా.. భారీగా పోలీసుల మోహరింపు..

రెండు దేశాల వాణిజ్య మంత్రులు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై గురువారం సంతకాలు చేయనున్నారు. ఇప్పటికే మోడీ మంత్రివర్గం ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. అమల్లోకి రావడానికి ముందు బ్రిటిష్ పార్లమెంట్‌లో కూడా ఆమోదం పొందవలసి ఉంటుంది.

ఇక లండన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. కింగ్ చార్లెస్‌ను కలవనున్నారు. అనంతరం మాల్లీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఆహ్వానం మేరకు మాల్దీవులు వెళ్తారు. జాతీయ దినోత్సవ వేడుకల్లో మోడీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నాయి. ముయిజ్జు అధ్యక్షుడయ్యాక మోడీ మాల్దీవుల్లో పర్యటించడం ఇదే తొలిసారి.

 

Exit mobile version