Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story India To Issue Tourist Visas To Chinese From Tomorrow

Delhi: చైనీయులకు శుభవార్త.. రేపటినుంచి టూరిస్ట్ వీసాలు ఇవ్వనున్న భారత్

Published Date :July 23, 2025 , 1:57 pm
By Suresh Maddala
  • చైనీయులకు శుభవార్త
  • రేపటినుంచి టూరిస్ట్ వీసాలు ఇవ్వనున్న భారత్
Delhi: చైనీయులకు శుభవార్త.. రేపటినుంచి టూరిస్ట్ వీసాలు ఇవ్వనున్న భారత్
  • Follow Us :
  • google news
  • dailyhunt

చైనీయులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గురువారం నుంచి టూరిస్ట్ వీసాలు ఇవ్వనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. 2020లో సరిహద్దు ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య బంధాలు తెగాయి. తాజాగా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇటీవల చైనాలో పర్యటించారు. అప్పటి నుంచి తిరిగి దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇన్నాళ్ల తర్వాత వీసాలను భారత్ పునరుద్ధరించింది. రేపటి నుంచి చైనీయులకు వీసాలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Bihar: ఎన్నికల ముందు బీహార్‌ను కుదిపేస్తున్న మటన్ పాలిటిక్స్

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. జూలై 24 నుంచి చైనా పౌరులకు భారతదేశం పర్యాటక వీసాలు జారీ చేయడం ప్రారంభిస్తుందని బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇరు దేశాలు ప్రత్యక్ష విమానాలను తిరిగి ప్రారంభించడానికి, వీసా సేవలను పునఃప్రారంభించడానికి, భారతీయ యాత్రికులు కైలాష్ మానసరోవర్‌కు ప్రయాణించడానికి అనుమతించడానికి సూత్రప్రాయంగా అంగీకరించాయి. తాజాగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని చెప్పడానికి భారత్ కీలక చర్యలు తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Bihar: ఓటర్ సర్వేపై దద్దరిల్లిన బీహార్ అసెంబ్లీ… అధికార-ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం

భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి రెండు రోజుల పర్యటన కోసం బీజింగ్‌కు వెళ్లారు. అత్యున్నత స్థాయిలో జరిగిన సమావేశం తర్వాత ఈ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 2025 వేసవిలో కైలాష్ మానసరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. సరిహద్దు నదులకు సంబంధించిన జలసంబంధమైన డేటా భాగస్వామ్యం, ఇతర సహకారాన్ని చర్చించడానికి భారతదేశం-చైనా నిపుణుల స్థాయి యంత్రాంగం ముందస్తు సమావేశానికి కూడా వారు కట్టుబడి ఉన్నారని MEA తెలిపింది.

ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనాలో పర్యటించారు. షాంఘై సహకార సంస్థ (SCO) విదేశాంగ మంత్రుల మండలి ప్రతినిధి బృందంలో భాగంగా బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కూడా కలిశారు. అలాగే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో జరిగిన ప్రత్యేక చర్చల్లో ఇరు దేశాల సంబంధాలపై చర్చించుకున్నారు. చైనా పర్యటన సంతృప్తినిచ్చిందని జైశంకర్ ట్వీట్ కూడా చేశారు. మొత్తానికి ఇన్నాళ్లకు ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • china
  • Chinese
  • Chinese citizens
  • Delhi
  • India issue

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions