Site icon NTV Telugu

India-Pakistan: అప్పుల కోసం పరుగులు పెడుతోంది.. యూఎన్‌లో పాక్‌పై భారత్ వ్యంగ్యాస్త్రాలు

India

India

మతోన్మాదంలో మునిగిపోయి.. ఐఎంఎఫ్ నుంచి వరుస రుణాల కోసం పరుగులు పెడుతోందని పాకిస్థాన్‌పై భారత్ విరుచుకుపడింది. అంతర్జాతీయ శాంతి, భద్రతల అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉన్నతస్థాయి చర్చ జరిగింది. ఈ సందర్భంగా పాక్‌ విదేశాంగశాఖ మంత్రి ఇషాక్‌దార్‌ మళ్లీ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. వివాదాస్పద భూభాగం అనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని వ్యాఖ్యానించారు. దీనికి ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ స్పందిస్తూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు

ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశం.. భారత్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ ఉపదేశాలు ఇవ్వడం తగదని హితవు పలికింది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో భారత్ దూసుకెళ్తుంటే.. పాక్‌ మాత్రం అప్పులు తీసుకోవడంలో బిజీగా ఉందని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఐఎంఎఫ్‌కు పాకిస్థాన్‌ వరుస రుణగ్రహీత అంటూ వ్యాఖ్యానించారు. ఇక పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను పర్వతనేని హరీష్ సమర్థించారు.

ఇది కూడా చదవండి: Delhi: కంత్రీ పోలీస్ జంట.. రికవరీ చేసిన రూ.2 కోట్లతో పరారై జల్సాలు

ఇదిలా ఉంటే భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల అంశాన్ని మరోసారి అమెరికా ప్రస్తావించింది. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని పరిష్కరించడంలో అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ నాయకత్వం కీలక పాత్ర పోషించిందని ఐరాసలో వాషింగ్టన్‌ రాయబారి వ్యాఖ్యానించారు. దీనికి పర్వతనేని హరీశ్ స్పందింస్తూ.. పాకిస్థాన్‌, పీఓకేలోని ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్‌ ఆపరేషన్‌ సింధూర్‌ను చేపట్టిందన్నారు. పాక్‌ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించినట్లు భారత ప్రతినిధి వెల్లడించారు.

Exit mobile version