Site icon NTV Telugu

Brazil: బ్రెజిల్ అధ్యక్షుడు సిల్వాతో ప్రధాని మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

Pmmodi

Pmmodi

ప్రధాని మోడీ బ్రెజిల్‌లో పర్యటిస్తున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్లారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ… ఆ దేశాధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు చర్చించారు. విద్యుత్‌, జీవ ఇంధనం, రక్షణ, వ్యవసాయ రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునే దిశగా భారత్‌ కృతనిశ్చయంతో ఉందని మోడీ తెలిపారు.

ఇది కూడా చదవండి: Upcoming EV’s: త్వరలో మార్కెట్లోకి రానున్న 5 బెస్ట్ SUVఈవీలు ఇవే.. ఇంకెందుకు ప్లాన్ చేసుకోండి

నైజీరియా పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ ఆదివారం బ్రెజిల్‌ చేరుకున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా వివిధ దేశాధినేతలతో విడివిడిగా మోడీ భేటీ అయ్యారు. పెట్టుబడులు, వివిధ రంగాల్లో పరస్పర సహకారం తదితర అంశాలపై చర్చించారు. రియో డి జనిరో వేదికగా జరుగుతున్న ఈ సదస్సులో జీ20 దేశాల ముఖ్యనేతలంతా పాల్గొన్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో కూడా మోడీ భేటీ అయ్యారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, సాంకేతిక అంశాల్లో సహకారం గురించి చర్చించామని భేటీ అనంతరం మోడీ వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సారాంశాన్ని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Relationship Tips: ఈ విషయాలు వైవాహిక జీవితాన్ని నాశనం చేయొచ్చు.. జాగ్రత్త సుమీ

Exit mobile version