Site icon NTV Telugu

India: పాక్ ప్రోత్సాహంతోనే భారత్‌లో ఉగ్ర దాడులు.. యూఎన్‌లో షరీఫ్ ప్రసంగాన్ని తిప్పికొట్టిన భారత్

India2

India2

ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగాన్ని భారత్ తిప్పికొట్టింది. భారత్ దౌత్యవేత్త పెటల్ గహ్లోట్ మాట్లాడుతూ.. అణు బ్లాక్ మెయిల్ ముసుగులో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని ఏ మాత్రం అంగీకరించబోమని తేల్చి చెప్పారు. భారతదేశం ఎలాంటి బెదిరింపులకు భయపడదని.. ఎప్పుడూ తలొగ్గదని వ్యాఖ్యానించారు. ప్రపంచానికి భారతదేశం సందేశం స్పష్టంగా ఉందని.. ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో ఖండించాలని కోరింది. ఇక భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు మూడో వ్యక్తి ప్రమేయం లేదని తేల్చి చెప్పారు.

ఇది కూడా చదవండి: Meenakshi-Chowdary : టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు అడుగు.. మీనాక్షి చౌదరి కొత్త ప్రయాణం

భారతదేశంతో పాకిస్థాన్ శాంతిని కోరుకుంటున్నట్లు షెహబాజ్ షరీఫ్ ప్రసంగాలు చేయడం కాదు.. మాటల్లో నిజంగా నిజాయితీ ఉంటే ఆచరణలో చూపించాలని హితవు పలికారు. అలాగైతే వెంటనే పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిబిరాలను తక్షణమే మూసివేతకు పిలుపునివ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా భారతదేశం అడుగుతున్న ఉగ్రవాదులను తక్షణమే అప్పగించాలని కోరారు. ద్వేషం, మతతత్వం, అసహనాన్ని అనుసరించే దేశం.. యూఎన్ సభలో విశ్వాస విషయాలపై బోధించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ అద్దం వైపు చూడడం చాలా కాలం అయి ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇది కూడా చదవండి: Off The Record : బాలకృష్ణ కామెంట్స్ పై మెగా బ్రదర్స్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్.. భారత్‌పై విజయం సాధించినట్లు చెప్పుకోవడం అబద్ధం అని తేల్చారు. భారతదేశమే పాకిస్థాన్ వైమానిక స్థావరాలను, ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు కూడా చూపించామని చెప్పారు. అంతేకాకుండా ఇటీవల ఆ ఉగ్ర సంస్థలు కూడా నిర్ధారించాయని పేర్కొన్నారు. భారతదేశంలో అమాయక పౌరులను ఉగ్రవాదులు చంపడానికి పాకిస్థాన్ ప్రోత్సాహంతోనే జరిగిందని స్పష్టం చేశారు. మా ప్రజల హక్కుల కోసం మేము మా హక్కును వినియోగించుకున్నట్లు తేల్చిచెప్పారు.

యూఎన్‌లో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగిస్తూ.. భారత్-పాకిస్థాన్ యుద్ధ సమయంలో భారత్‌పై పాకిస్థానే విజయం సాధించిందని.. హిందుత్వం ప్రపంచానికి ప్రమాదమని పేర్కొన్నారు. అంతేకాకుండా ట్రంప్ సూచన మేరకే భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ జరిగిందని చెప్పారు. ట్రంప్ ప్రపంచ శాంతి కాముకుడు అని షరీఫ్ ప్రశంసించారు.

Exit mobile version