Site icon NTV Telugu

India: సొంత ప్రజలను బాంబులతో చంపుకుంటుంది.. యూఎన్‌లో పాక్‌ ఉపాన్యాసంపై భారత్ ధ్వజం

India

India

అంతర్జాతీయ వేదికగా భారతదేశంపై నిందలు మోపే ప్రయత్నం చేసిన దాయాది పాకిస్థాన్‌కు భారత దౌత్యవేత్త పర్వతనేని హరీష్ గట్టిగా బుద్ధి చెప్పారు. సొంత ప్రజలను బాంబులతో చంపే దేశం.. తమపై నిందలు వేయడం చాలా విడ్డూరంగా ఉందంటూ తిప్పికొట్టారు.

ఐక్యరాజ్యసమితిలో మహిళలు, శాంతి, భద్రతపై బహిరంగ చర్చ సందర్భంగా.. కాశ్మీరీ మహిళలు దశాబ్దాలుగా లైంగిక హింసను భరిస్తున్నారని పాకిస్థాన్ అధికారి సౌమా సలీమ్‌ ఆరోపించింది. అంతే ధీటుగా భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ ఘాటుగా స్పందించారు. సొంత ప్రజలను బాంబులతో చంపుకునే దేశం ఏదో ప్రపంచానికి తెలుసు అంటూ తిప్పికొట్టారు. తప్పుదారి పట్టించడానికి.. అతిశయోక్తితో ప్రపంచ దృష్టి మరల్చేందుకు పాకిస్థాన్ వక్రబుద్ధి ప్రదర్శిస్తుందంటూ భారత్ తిప్పికొట్టింది. తమ దేశ పౌరులను ఎలా కాపాడుకుంటామో ప్రపంచానికి తెలుసు అని హరీష్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Congress Meeting: నేడు సీఎం రేవంత్ తో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్ భేటీ..

1971లో ఆపరేషన్ సెర్చ్‌లైట్‌ను నిర్వహించింది పాకిస్థాన్ అని గుర్తుచేసూ దాయాది తీరును ఖండించారు. ఆ సమయంలో పాక్ సైన్యం ఒక క్రమబద్ధమైన జాతి విధ్వంసక సామూహిక అత్యాచారాన్ని నిర్వహించిందని.. 4,00,000 మంది మహిళలను క్రమబద్ధమైన మారణహోమం, సామూహిక అత్యాచారాలను చేసిందని గుర్తుచేశారు. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన మానవ హక్కుల రికార్డులను కలిగి ఉన్న దేశం పాకిస్థాన్ అని ధ్వజమెత్తారు. ఇతరులపై వేలు చూపించే ముందు సొంత మతపరమైన మైనారిటీలపై రాజ్య హింస, వ్యవస్థాగత వివక్షను గుర్తుంచుకోవాలని భారత్ హితవు పలికింది.

ఇది కూడా చదవండి: SSMB29 : జక్కన్న స్పెషల్ ప్లాన్.. మహేశ్ -ప్రియాంక చోప్రా ఫోక్ సాంగ్ రెడీ!

‘‘మానవ హక్కుల రికార్డు ఇంత దారుణంగా ఉన్న దేశం ఇతరులకు ఉపన్యాసాలు ఇవ్వడానికి ధైర్యం చేయడం చాలా విడ్డూరం’’ అని జెనీవాలోని భారత శాశ్వత మిషన్ కౌన్సెలర్ కె.ఎస్. మహమ్మద్ హుస్సేన్ గత మంగళవారం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 60వ సమావేశంలో జరిగిన సాధారణ చర్చ సందర్భంగా వ్యాఖ్యానించారు.

 

Exit mobile version