UN: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై యూఎన్ లో ఓటింగ్.. మరోసారి ఇండియా గైర్హాజరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RUSSIA-UKRAINE WAR: ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసి ఏడాది గడుస్తున్న సందర్భంగా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని, తక్షణమే తమ బలగాలను ఉపసంహరించుకోవాలని రష్యాను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. అయితే ఈ తీర్మానానికి మెజారిటీ దేశాలు ఆమోదం తెలిపాయి. 193 దేశాలు ఉన్న యూఎన్ జనరల్ అసెంబ్లీలో 141 సభ్యదేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. తీర్మానాన్ని 7 దేశాలు వ్యతిరేకించగా, 32 దేశాలు గైర్హాజరు అయ్యాయి.
Read Also: World Bank: ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి ఇండో అమెరికన్.. నామినేట్ చేసిన అమెరికా
Also Read
- Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
గతంలో రష్యాపై యూఎన్ తీర్మాన సమయంలో అనుసరించిన విధంగానే మరోసారి భారత్ తటస్థతను ప్రదర్శించింది. భారత్ ఓటింగ్ కు గైర్హాజరు అయింది. చైనా కూడా ఓటింగ్ కు దూరంగా ఉంది. చర్చలు, దౌత్యమార్గాల ద్వారా ఉక్రెయిన్, రష్యాలు సమస్యలను పరిష్కరించుకోవాలని తొలి నుంచి భారత్ చెబుతోంది. దీంతో పలుమార్లు ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు దూరంగా ఉంది.
ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలకు అనుగుణంగా ఉక్రెయిన్‌లో సమగ్రమైన, న్యాయమైన, శాశ్వతమైన శాంతిని నెలకొల్పాలని తాజాగా ప్రవేశపెట్టిన తీర్మానం పేర్కొంది. దీనికి కోసం దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సభ్యదేశాలు, అంతర్జాతీయ సంస్థలు తీర్మానంలో పిలుపునిచ్చాయి.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?