NTV Telugu Site icon

India blocks Pakistan-based OTT platform: పాక్‌కు భారత్‌ షాక్.. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌, వెబ్‌సైట్‌ సహా మరికొన్ని బ్యాన్‌..

Vidly Tv

Vidly Tv

పాకిస్థాన్‌కు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫారమ్ విడ్లీ టీవీ వెబ్‌సైట్, యాప్‌లు, సోషల్ మీడియా ఖాతాలను భారత్ బ్లాక్ చేస్తుంది.. ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఇటీవల ఒక సిరీస్‌ను విడుదల చేసింది – “సేవక్: ది కన్ఫెషన్స్”, ఇది జాతీయ భద్రత, రక్షణ మరియు విదేశీ రాష్ట్రాలతో భారతదేశం యొక్క స్నేహపూర్వక సంబంధాలకు హాని కలిగిస్తోందని కేంద్రం గుర్తించింది.. దీంతో, ఓటీటీ ప్లాట్‌ఫారమ్ విడ్లీ టీవీకి చెందిన ఒక వెబ్‌సైట్, రెండు మొబైల్ అప్లికేషన్‌లు, నాలుగు సోషల్ మీడియా ఖాతాలు మరియు ఒక స్మార్ట్ టీవీ యాప్‌ను బ్లాక్ చేసింది. ఐటీ రూల్స్ 2021 యొక్క అత్యవసర అధికారాల క్రింద సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది.

Read Also: India and China Troops Clash: భారత్-చైనా సరిహద్దుల్లో మళ్లీ టెన్షన్‌.. జవాళ్లకు గాయాలు

ఈ సిరీస్ భారతదేశానికి సంబంధించిన సున్నితమైన, చారిత్రక సంఘటనలను వక్రీకరించిందని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది.. ఆపరేషన్ బ్లూ స్టార్ మరియు దాని తదనంతర పరిణామాలు, అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత, క్రైస్తవ మిషనరీ హత్య.. గ్రాహం స్టెయిన్స్ వంటి సున్నితమైన చారిత్రక సంఘటనలు.. జాతీయ ప్రాముఖ్యత కలిగిన విషయాలపై ఈ వెబ్-సిరీస్ భారతదేశ వ్యతిరేక కథనాన్ని చిత్రీకరించింది. మాలెగావ్ పేలుళ్లు, సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్లు, సట్లెజ్ యమునా లింక్ కాలువకు సంబంధించిన అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదం సహా.. ఇతర అంశాలు ఉన్నాయని పేర్కొంది.. ఈ వెబ్ సిరీస్‌ను పాకిస్థానీ సమాచార కార్యకలాపాల యంత్రాంగం స్పాన్సర్ చేసిందని అనుమానిస్తోంది భారత్‌.. ఈ సిరీస్‌లోని మొదటి ఎపిసోడ్ 2008లో ముంబైపై జరిగిన ఉగ్రదాడుల రోజును పురస్కరించుకుని ఈ ఏడాది నవంబర్‌ 26వ తేదీన విడుదల చేశారు.. వెబ్ సిరీస్‌లోని మూడు ఎపిసోడ్‌లు ఇప్పటివరకు విడుదలయ్యాయి.

Show comments