Site icon NTV Telugu

India Pakistan War: భారత్, బీఎల్ఏ, తాలిబాన్లు.. పాకిస్తాన్‌పై ముప్పేట దాడి..

Bla

Bla

India Pakistan War: పాకిస్తాన్, తాను ఎంత నాశనం అవుతున్నా భారత్ ఎదగకూడదు, భారత్ ప్రశాంతంగా ఉండకూడదు అనేదే దాని ఉద్దేశ్యం. భారత్‌ని చికాకు పరుస్తూ పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర సంస్థలకు మద్దతు ఇస్తోంది. ఇటీవల, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి లష్కరే తోయిబా పనే. ఈ దాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ని ప్రారంభించి పాక్, పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భీకర దాడులు చేసింది. 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది.

Read Also: Pak Drone Attack: పౌర విమానాలను రక్షణగా వాడుకుంటూ పాకిస్తాన్ డ్రోన్ దాడులు..

ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌కి ఇప్పుడు ముప్పేట దాడి ఎదురవుతోంది. ఓ వైపు బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) యోధులు స్వాతంత్ర్యం కోసం పాక్ ఆర్మీపై దాడులు చేస్తుున్నారు. పాక్ సైనికులు, పంజాబ్ ప్రావిన్సుకు చెందిన వారు కనిపిస్తే కాల్చి చంపుతున్నారు. ప్రస్తుతం బలూచ్ రాజధాని క్వెట్టాతో సహా పలు ప్రముఖ పట్టణాలు బీఎల్ఏ ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా, తెహ్రీక్ ఏ తాలిబాన్(టీటీపీ) కూడా పాకిస్తాన్ పై విరుచుకుపడుతోంది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలో పాకిస్తాన్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేసింది. 30 మంది పాక్ సైనికుల్ని హతమార్చినట్లు తాలిబాన్ ప్రతినిధి ప్రకటించారు. పాకిస్తాన్ ఇప్పుడు మూడు వైపుల నుంచి దాడుల్ని ఎదుర్కొంటోంది. అయినప్పటికీ, పాక్ ఆర్మీ భారత్‌పై డ్రోన్ దాడికి తెగబడుతూనే ఉంది. వరసగా శుక్రవారం రెండో రోజు కూడా దాడికి పాల్పడింది.

Exit mobile version