India Pakistan War: భారత్, బీఎల్ఏ, తాలిబాన్లు.. పాకిస్తాన్‌పై ముప్పేట దాడి..
- ఓ వైపు భారత్, మరోవైపు బీఎల్ఏ, తాలిబాన్ దాడులు..
- అయినా పాకిస్తాన్‌కి బుద్ధి రావడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan War: పాకిస్తాన్, తాను ఎంత నాశనం అవుతున్నా భారత్ ఎదగకూడదు, భారత్ ప్రశాంతంగా ఉండకూడదు అనేదే దాని ఉద్దేశ్యం. భారత్‌ని చికాకు పరుస్తూ పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర సంస్థలకు మద్దతు ఇస్తోంది. ఇటీవల, పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి లష్కరే తోయిబా పనే. ఈ దాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ని ప్రారంభించి పాక్, పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భీకర దాడులు చేసింది. 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది.
Read Also: Pak Drone Attack: పౌర విమానాలను రక్షణగా వాడుకుంటూ పాకిస్తాన్ డ్రోన్ దాడులు..
Also Read
ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌కి ఇప్పుడు ముప్పేట దాడి ఎదురవుతోంది. ఓ వైపు బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) యోధులు స్వాతంత్ర్యం కోసం పాక్ ఆర్మీపై దాడులు చేస్తుున్నారు. పాక్ సైనికులు, పంజాబ్ ప్రావిన్సుకు చెందిన వారు కనిపిస్తే కాల్చి చంపుతున్నారు. ప్రస్తుతం బలూచ్ రాజధాని క్వెట్టాతో సహా పలు ప్రముఖ పట్టణాలు బీఎల్ఏ ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా, తెహ్రీక్ ఏ తాలిబాన్(టీటీపీ) కూడా పాకిస్తాన్ పై విరుచుకుపడుతోంది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలో పాకిస్తాన్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేసింది. 30 మంది పాక్ సైనికుల్ని హతమార్చినట్లు తాలిబాన్ ప్రతినిధి ప్రకటించారు. పాకిస్తాన్ ఇప్పుడు మూడు వైపుల నుంచి దాడుల్ని ఎదుర్కొంటోంది. అయినప్పటికీ, పాక్ ఆర్మీ భారత్‌పై డ్రోన్ దాడికి తెగబడుతూనే ఉంది. వరసగా శుక్రవారం రెండో రోజు కూడా దాడికి పాల్పడింది.
- Tags
తాజావార్తలు
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన యువతకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. రూ.2 లక్షల చొప్పున సాయం..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!