Imran Khan: “కొకైన్” వాడిన ఇమ్రాన్ ఖాన్.. మెడికల్ రిపోర్టుల్లో తేలిందన్న పాక్ మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: అవినీతి ఆరోపణలతో ఈ నెల మొదట్లో అరెస్ట్ అయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొకైన్ డ్రగ్ వాడినట్లు వెల్లడైంది. పాకిస్తాన్ ఆరోగ్య మంత్రి అబ్దుల్ ఖాదిర్ పటేల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఐదుగురు వైద్యుల ప్యానెల్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అవినీతి కేసులో అరెస్టైన ఇమ్రాన్ ఖాన్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంట్లో మద్యం, కొకైన్ వాడినట్లు వెల్లడైంది. ఇప్పటికే 100కి పైగా కేసుల ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్, ఈ కేసులో చట్టపరమైన చర్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది.
Read Also: Mahindra Thar 5-door: మహీంద్రా థార్ 5-డోర్ వచ్చేది అప్పుడే..
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో అరెస్టయిన తర్వాత ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఇమ్రాన్ ఖాన్ మూత్ర నమూనాను తీసుకున్నారు. ప్రాథమిక వైద్య నివేదికలో “ఆల్కహాల్ మరియు కొకైన్” వంటి “టాక్సిక్ కెమికల్స్” వాడినట్లు వెల్లడైంది. ఇమ్రాన్ ఖాన్ మానసిక స్థితి ప్రశ్నార్థకంగా ఉందని పేర్కొన్నారు.
అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసు అవినీతి కేసులో మే 9న ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణంలో పారామిలిటీరీ రేంజర్లు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ తర్వాత ఆయన పార్టీ పాకిస్తాన్-తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) కార్యకర్తలు, ఇమ్రాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనకు పాల్పడ్డారు. ఇస్లామాబాద్ తో పాటు లాహోర్, కరాచీ, క్వెట్టా, పెషావర్ నగరాల్లో హింసకు పాల్పడ్డారు. ఇమ్రాన్ ఖాన్‌పై డ్రగ్స్ ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన మాజీ భార్య రెహమ్‌ఖాన్ కొకైన్ వాడినట్లు ఆరోపించారు.
- Tags
- cocaine
- Imran Khan
- Pakistan
- PTI
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!