NTV Telugu Site icon

Imran Khan: “కొకైన్” వాడిన ఇమ్రాన్ ఖాన్.. మెడికల్ రిపోర్టుల్లో తేలిందన్న పాక్ మంత్రి..

Imran Khaan

Imran Khaan

Imran Khan: అవినీతి ఆరోపణలతో ఈ నెల మొదట్లో అరెస్ట్ అయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొకైన్ డ్రగ్ వాడినట్లు వెల్లడైంది. పాకిస్తాన్ ఆరోగ్య మంత్రి అబ్దుల్ ఖాదిర్ పటేల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఐదుగురు వైద్యుల ప్యానెల్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అవినీతి కేసులో అరెస్టైన ఇమ్రాన్ ఖాన్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంట్లో మద్యం, కొకైన్ వాడినట్లు వెల్లడైంది. ఇప్పటికే 100కి పైగా కేసుల ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్, ఈ కేసులో చట్టపరమైన చర్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది.

Read Also: Mahindra Thar 5-door: మహీంద్రా థార్ 5-డోర్ వచ్చేది అప్పుడే..

అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో అరెస్టయిన తర్వాత ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఇమ్రాన్ ఖాన్ మూత్ర నమూనాను తీసుకున్నారు. ప్రాథమిక వైద్య నివేదికలో “ఆల్కహాల్ మరియు కొకైన్” వంటి “టాక్సిక్ కెమికల్స్” వాడినట్లు వెల్లడైంది. ఇమ్రాన్ ఖాన్ మానసిక స్థితి ప్రశ్నార్థకంగా ఉందని పేర్కొన్నారు.

అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసు అవినీతి కేసులో మే 9న ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణంలో పారామిలిటీరీ రేంజర్లు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ తర్వాత ఆయన పార్టీ పాకిస్తాన్-తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) కార్యకర్తలు, ఇమ్రాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనకు పాల్పడ్డారు. ఇస్లామాబాద్ తో పాటు లాహోర్, కరాచీ, క్వెట్టా, పెషావర్ నగరాల్లో హింసకు పాల్పడ్డారు. ఇమ్రాన్‌ ఖాన్‌పై డ్రగ్స్‌ ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన మాజీ భార్య రెహమ్‌ఖాన్‌ కొకైన్ వాడినట్లు ఆరోపించారు.