NTV Telugu Site icon

Imran Khan: పాకిస్తాన్ లో కూడా శ్రీలంక తరహా ఉద్యమం వస్తుంది.

Imran Khan

Imran Khan

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని శ్రీలంక అల్లాడుతోంది. శ్రీలంక తరువాత ఏ దేశం అంటే వినిపించే పేరు పాకిస్తాన్. అయితే అక్కడ కూడా శ్రీలంక తరహా ఉద్యమం వస్తుందని మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ శనివారం హెచ్చరించారు. మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చే రోజు దగ్గర్లో ఉందంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఆసిఫ్ జార్దారీ, షరీఫ్ కుటుంబాలు మూడు నెల్లలోనే తాము అక్రమంగా సంపాదించిన సంపదను కాపాడుకునేందుకు రాజకీయంగా, ఆర్ధికంగా దేశాన్ని దివాలా తీయిస్తున్నారని ట్విట్టర్ వేదికగా ఇమ్రాన్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం మూడు నెల్లలోనే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని.. 30 ఏళ్లుగా పాకిస్తాన్ ను దోచుకుంటున్నారు అని ట్విట్టర్ లో ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

Read Also: Vishnu Vishal: భర్త నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన గుత్తా జ్వాల

పాక్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మాణం పెట్టి ఓడించాయి ప్రతిపక్షాలు. ఆ తరువాత పాక్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్ బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ పదవిలో ఉన్నప్పటి నుంచే పాక్ నెమ్మదిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. విదేశీ అప్పులు ఎక్కువ కావడంతో పాటు.. దేశంలో ద్రవ్యోల్భనం పెరిగి నిత్యావసరాలు, పెట్రోల్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం పాకిస్తాన్ లో పెట్రోల్ ధరలు ఆల్ టైం హైకి చేరాయి. ఇదిలా ఉంటే ఆర్థిక కష్టాల నుంచి గట్టేంకేందుకు టీ పొడి, ఇతర లగ్జరీ వస్తువుల దిగుమతిని తగ్గించింది పాక్. చివరకు ఇంధన కొరతతో విద్యుత్ కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి ఉంది. సాయంత్రం వరకే షాపింగ్ మాల్స్, ఆఫీసులు పనిచేయాలని అక్కడి ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. ఇక రాజకీయంగా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం స్థిరంగా లేదు. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ వరసగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. పాకిస్తాన్, శ్రీలంక మాదిరిగా దివాలా తీయడం కాస్త ఆలస్యం కావచ్చమో కానీ.. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం పక్కా అని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.