Imran Khan Calls For Fresh Polls In Pakistan: పాకిస్తాన్ తో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ దిగిపోయి.. షహజాబ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి అక్కడ రాజకీయ సంక్షోభం మొదలైంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆజాదీ మార్చ్ పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాడు.
Read Also: Iran Hijab Protest: ఆస్కార్ విన్నింగ్ మూవీ నటిని అరెస్ట్ చేసిన ఇరాన్.. మద్దతు తెలపడమే పాపమైంది
ఇదిలా ఉంటే తన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) ప్రభుత్వాలు అధికారంలో ఉన్న పంజాబ్, ఖైబర్ ఫఖ్తున్ ఖ్వా ప్రావిన్సుల్లో డిసెంబర్ 23న ప్రభుత్వాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి సంచలనానికి తెరతీశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగకుంటే పాకిస్తాన్ మునిగిపోతుందనని మేమంతా భయపడుతున్నట్లు ఇమ్రాన్ ఖాన్ అన్నారు. దేశంలో స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఓడిపోతామని భయంతోనే ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించడం లేదని ఆరోపించారు. ఇప్పటికే జాతీయ అసెంబ్లీకి మా 123-125 మంది సభ్యులు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను ఆమోదించమని అసెంబ్లీలో స్పీకర్ని కోరుతామని అన్నారు.
ఈ ప్రభుత్వానికి ఎన్నికల ద్వారా గుణపాఠం చెప్పాలని.. ఈ దొంగల పేర్లను శాశ్వతంగా తుడిచిపెట్టే వరకు ఓడించాలని పిలుపునిచ్చాడు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం వల్ల దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని అన్నారు. దేశం మునిగిపోతుందని భయపడుతున్నామని.. దీనికి ఎన్నికలే సరైన మార్గం అని అన్నారు. తన పార్టీకి వ్యతిరేకంగా పన్నిన కుట్రలో పాకిస్తాన్ మాజీ ఆర్మీ ఛీప్ కమర్ జావేద్ బజ్వా ప్రమేయం ఉందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.