NTV Telugu Site icon

Donald Trump: నేను చనిపోయాను అనుకున్నాను..

Delonad

Delonad

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో చెవికి తీవ్ర గాయమైంది. దీని గురించి తాజాగా ట్రంప్ రియాక్ట్ అయ్యారు. అసలు నేను మీ ముందు ఇలా ఉండేవాడినే కాదు.. కాల్పుల ఘటనలో చనిపోయాననే అనుకున్నాను.. ఇదొక చిత్రమైన పరిస్థితి అని ట్రంప్ తెలిపారు. ఆ సమయంలో ఆయన చెవికి బ్యాండేజ్ ఉండటం గమనించొచ్చు. ఇక, రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో పాల్గొనేందుకు విమానంలో ప్రయాణిస్తూ మాజీ అధ్యక్షుడు ఈ విధంగా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి చర్య మన దేశంలో జరగడం నమ్మశక్యంగా లేదన్నారు. కాల్పుల శబ్దాలు వినగానే ఏదో జరుగుతుందనేది అర్థమైందన్నారు.

Read Also: CMRF Applications: ఆన్‌లైన్‌లో మొదలైన సీఎం సహాయనిధి దరఖాస్తులు.. లింక్ ఇదే..

ఇక, డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటన తర్వాత అధ్యక్ష రేసు ఏకపక్షమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తూటా తాకిన వెంటనే కిందకు వంగి.. తర్వాత పిడికిలి బిగించి బలంగా పైకి లేచిన ట్రంప్‌ తీరు పలువురిని ఆకర్షించింది. యూఎస్ కు కావాల్సింది ఇలాంటి యోధుడే’ అని రిపబ్లికన్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఆయన వ్యతిరేకులు కుట్ర సిద్ధాంతాలకు తెర తీశారని ఆరోపణలు గుప్పించారు. ఇదంతా సానుభూతి కోసమా అని విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖంపై రక్తం.. పిడికిలి బిగించి ఎత్తిన చేయి.. వెనక అమెరికా జెండా.. చుట్టూ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాంటి టైంలో కూడా ఇంత పర్ఫెక్ట్‌గా తీసిన ఫోటోపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌ను నమ్మలేమంటూ పలువురు ఆ ఘటన దృశ్యాలను నెట్టింట షేర్ చేస్తున్నారు.