Ilhan Omar: పచ్చి భారత వ్యతిరేకి ఎల్హాన్ ఒమర్, మరోసారి విషం చిమ్మింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ilhan Omar: అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు, పచ్చి భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్ మరోసారి భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మైనారిటీల భద్రత పేరుతో దేశంపై విషం చిమ్మింది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీలపై పలు సందర్భాల్లో ఒమర్ ఆరోపణలు చేసింది. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు పెద్ద మద్దతురాలుగా ఉంది. ఇదిలా ఉంటే, ఆమె మరోసారి భారత్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసింది.
ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ (IAMC) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, భారత్‌లో మైనారిటీలపై వ్యవస్థాగత ఒత్తిడి పెరుగుతోందని ఆరోపించింది. అమెరికన్ న్యాయవేత్త గ్రెగరీ స్టాంటన్ రూపొందించి. ‘‘10 దశల జెనోసైడ్’’ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ.. భారత్‌లో ‘‘8వ దశ జాతి నిర్మూలన’’ జరుగుతోందని అబద్ధాలను ప్రచారం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వమే కాకుండా, సమాజ స్థాయిలో కూడా ఇది విస్తరిస్తోందని ఆరోపించింది.
Also Read
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
అయితే, ఆమె వ్యాఖ్యల్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం ఆమెకు అలవాటే అని చెబుతున్నారు. మైనారిటీ జనాభా, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ వ్యవస్థల్లో వారి భాగస్వామ్యం వంటి అంశాల్లో మైనారిటీలకు భారత్ సముచిత ప్రాధానత్య ఇస్తుందనే విషయాన్ని మరిచిపోయిన ఇల్హాన్ ఒమర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఇటీవల కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. భారత్ ప్రపంచంలో మైనారిటీలకు సురక్షితమైన దేశంగా ఉందని చెప్పారు. గత 12 ఏళ్లలో మైనారిటీల జీవన ప్రమాణాలు, అవకాశాలు మరింత మెరుగయ్యాయని ఆయన అన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన సమయంలో భారత్ జనాభాలో 11 శాతం మైనారిటీలు ఉంటే, ఇప్పుడు ఇది 20 శాతానికి చేరిందని అధికారుల అంచనాలు చెబుతున్నాయి. ఇల్హాన్ ఒమర్ గతంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పర్యటించింది. ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు మద్దతు తెలిపింది. అంతర్జాతీయ వేదికలపై పలు సందర్భాల్లో భారత్‌పై విమర్శలు చేసింది. తాజాగా అమెరికాలో జరిగిన ఈ కార్యక్రమంలో మెన్నెసోటా అటార్నీ జనలర్ కీత్ ఎల్లిసన్, మిన్నెసోటా సెనేట్ నేత ఎరిన్ మర్ఫీ వంటి వారు పాల్గొన్నారు. వీరంతా భారత్‌లో మైనారిటీల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?