NTV Telugu Site icon

Israel-Hezbollah War: 500కి చేరిన లెబనాన్ మృతుల సంఖ్య.. పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ సూచన

Israelwar

Israelwar

లెబనాన్‌పై సోమవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య మరింత పెరుగుతోంది. సోమవారం 300 మంది చనిపోయినట్లు లెబనాన్ ప్రకటించగా.. ఆ సంఖ్య ప్రస్తుతం 500 మందికి చేరింది. వందలాది మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ గురి చూసి లక్ష్యాలను చేధించినట్లు సమాచారం. లెబనాన్ రాజధాని బీరుట్‌లో హిజ్బుల్లా నేతలు నివాస ప్రాంతాల్లో అత్యంత రహస్యంగా సమావేశం అయ్యారు. చాలా గోప్యంగా ఈ భేటీ జరిగింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం గురి చేసి వారిపై దాడి చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Prakash raj: పవన్ కళ్యాణ్ ఫైర్.. వీడియో రిలీజ్ చేసిన ప్రకాష్ రాజ్

నివాస ప్రాంతాల్లో హిజ్బుల్లా ఆయుధాలను నిల్వ చేసినట్లు సమాచారం. సామాన్య ప్రజలను మానవ కవచాలుగా చేసుకున్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. లెబనీస్ పౌరులు తక్షణమే నివాసాలు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు విజ్ఞప్తి చేశారు. ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూప్‌.. పౌరులను బందీలుగా చేసుకున్నట్లు తెలుస్తోంది. వారిని అడ్డంపెట్టుకుని హిజ్బుల్లా యుద్ధానికి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ కోరింది. లెబనాన్‌లోని 800 హిజ్బుల్లా లక్ష్యాలను తాకినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తమ ఆపరేషన్ పూర్తయ్యే వరకు ప్రజలు ఇళ్లకు దూరంగా ఉండాలని.. ఆపరేషన్ పూర్తయ్యాక తిరిగి తమ ఇళ్లకు చేరుకోవచ్చని నెతన్యాహు మీడియా సందేశం విడుదల చేశారు.

ఇది కూడా చదవండి: Speaker Prasad: నితిన్ గడ్కరీని కలిసిన స్పీకర్.. నిధులు మంజూరు చేయాలని వినతి

లెబనాన్‌పై సోమవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 24 మంది పిల్లలతో సహా మొత్తం 500 మంది చనిపోయినట్లు లెబనీస్ ఆరోగ్య మంత్రి తెలిపారు. అక్టోబరు 7న గాజాతో మొదలైన యుద్ధం తర్వాత ఇదే అతి పెద్ద దాడిగా తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. లెబనాన్‌లో ఉద్రిక్తతలను తగ్గించడానికి యునైటెడ్ స్టేట్స్ కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. “నేను ఇజ్రాయెల్ మరియు లెబనాన్‌లోని తాజా పరిణామాలపై చర్చిస్తున్నాను. నా బృందం వారి సహచరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ప్రజలు సురక్షితంగా ఇంటికి తిరిగి రావడానికి అనుమతించే విధంగా మేము తీవ్రంగా కృషి చేస్తున్నాము.’ అని బైడెన్ చెప్పారు.

ఇది కూడా చదవండి: Virat Kohli-Vaughan: విరాట్‌ కోహ్లీని అమ్మేస్తా.. మైఖేల్‌ వాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!