Site icon NTV Telugu

కాబూల్ నుంచి అధికారులను భారత్‌కు త‌ర‌లింపు…

ఆఫ్ఘ‌నిస్తాన్ తాలిబ‌న్ల వ‌శం కావ‌డంతో రాజ‌ధాని కాబూల్‌లోని అన్ని దేశాలు త‌మ ఎంబ‌సీల‌ను ఖాళీ చేసి స్వ‌దేశం వెళ్లిపోతున్నాయి.  అధికారుల‌ను, భ‌ద్ర‌తా సిబ్బందిని స్వ‌దేశానికి తీసుకెళ్తున్నారు.  ఇందులో భాగంగానే ఈరోజు కాబూల్ విమాన‌శ్ర‌యం నుంచి భార‌త రాయ‌బార అధికారులు, భ‌ద్ర‌తా సిబ్బంది 120 మందిని సీ 17 వైమానిక విమానం ద్వారా ఇండియాకు త‌ర‌లించారు.  గుజ‌రాత్‌లోని జామ్‌న‌గ‌ర్‌కు సీ 17 విమానం చేరుకున్న‌ది.  కాబూల్ నుంచి వ‌చ్చిన వీరికి విదేశాంగ శాఖాధికారులు స్వాగ‌తం ప‌లికారు.  ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఉన్న మిగిలిన భార‌తీయుల‌ను కూడా త‌ర‌లించేందుకు అధికారులు త్వ‌రిత‌గ‌తిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుం కాబూల్ ఏయిర్‌పోర్ట్ యూఎస్ ఆర్మీ స్వాధీనంలో ఉండ‌టంతో యూఎస్ ఆర్మీజ‌న‌ర‌ల్‌లో భార‌త అధికారులు సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు.  వేగంగా భార‌త విమానాల‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వాల‌ని కోరారు.  

Read: ప్ర‌జ‌లు పారిపోతుంటే… పార్కుల్లో ఎంజాయ్ చేస్తున్న తాలిబ‌న్లు…

Exit mobile version