Monsoon Brides: పాకిస్తాన్‌లో “రుతుపవన పెళ్లికూతుళ్లు”..
- పాకిస్తాన్‌లో పెరుగుతున్న బాల్య వివాహాలు..
- ‘‘రుతపవన పెళ్లికూతుళ్లు’’ ఇప్పుడు కొత్త ట్రెండ్..
- 2022 నాటి భారీ వరదలే కారణం..
- పేదరికం నుంచి బయటపడాలని తల్లిదండ్రుల ఆలోచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon Brides: భారత ఉపఖండంలోని దేశాలకు రుతుపవనాలే జీవనాధారం. రుతుపవనాలపై ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. అయితే, పాకిస్తాన్‌లో మాత్రం ‘‘రుతపవన పెళ్లికూతుళ్లు’’ పెరుగుతున్నారు. బాల్యంలోనే వారి తల్లిదండ్రులు వివాహాలు జరిపిస్తున్నారు. 2022లో పాకిస్తాన్ వ్యాప్తంగా, ముఖ్యంగా సింధ్ ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలు వచ్చాయి. అప్పటి నుంచి ఈ దేశం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికీ ఆ ప్రాంతంలో వ్యవసాయ భూములు నీటిలోనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. సింధ్ ప్రావిన్సులోని వ్యవసాయ ప్రాంతాల్లోని చాలా గ్రామాల్లో ఇప్పటికీ కోలుకోలేదు. అయితే, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి కోలుకోవడానికి చాలా కుటుంబాలు తన మైనర్ బాలికలకు వివాహం చేస్తున్నాయి. కుటుంబ మనుగడ కోసం డబ్బులు తీసుకుని పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. 2022 నుంచి దాదు జిల్లాలో ఈ ‘‘మాన్ సూన్ బ్రైడ్స్’’ అనే కొత్త ట్రెండ్ పెరిగినట్లు బాల్యవివాహాలను అరికట్టేందుక ప్రయత్నిస్తున్న సుజాన్ సన్సార్ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవసాపకుడు మషూక్ బిర్మానీ చెప్పారు.
Also Read
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్‌న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్‌కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
Read Also: Bulldozer action: ఉదయ్‌పూర్‌లో మత ఘర్షణలకు కారణమైన నిందితుడి ఇళ్లు కూల్చివేత..
కుటుంబాల మనుగడ కోసం ఏదైనా మార్గాన్ని కనుగొంటారు, దీంట్లో అత్యంత స్పష్టమైన మార్గం డబ్బుకు బదులుగా వారి కుమార్తెలకు వివాహం చేయడం అని ఆయన అన్నారు. ఖాన్ మొహ్మద్ ముల్లాహ్ గ్రామంలో జూన్‌లో ఉమ్మడి వేడుకల్లో షమీలా, అమీనా వివాహం జరిగింది. గత వర్షాకాలం నుంచి 45 మంది తక్కువ వయసు కలిగిన బాలికలు ఇప్పుడు భార్యలుగా మారారు. వారిలో 15 మందికి ఈ ఏడాది మే, జూన్‌లో వివాహాలు జరిగాయి. తమ కుమార్తెలను పేదరికం నుంచి కాపాడేందుకు డబ్బుకు బదులుగా వివాహాలు చేశామని తల్లిదండ్రులు చెబుతున్నారు.
షామిలా అనే బాలిక అత్తగారు మాట్లాడుతూ.. ఆమె తల్లిదండ్రులకు 20,000ల పాకిస్తానీ రూపాయాలు ఇచ్చామని చెప్పారు. నజ్మా అలీ అనే బాలికకు 2022లో 14 ఏట వివాహం చేశారు. ‘‘తన పెళ్లి కోసం నా భర్త తల్లిదండ్రులు 2,50,000 రూపాయలు ఇచ్చారు. అయితే, ఇదంతా అప్పుగా ఇచ్చారని, ప్రస్తుతం వారు ఇప్పుడు చెల్లించే మార్గం లేదు’’ అని ఆమె చెప్పింది. ప్రస్తుతం నజ్మా అలీ ఆరేళ్ల బిడ్డకు తల్లి. పాకిస్తాన్‌లో వివిధ ప్రావిన్సుల్లో బాలికల చట్టబద్ధమైన వివాహ వయసు 16-18గా ఉంది. అయితే, అంతకన్నా తక్కువ వయసులోనే బాలికలకు వివాహాలు జరగడం ఆ దేశంలో సాధారణమైంది. బాల్యవివాహాలు జరిగే టాప్ దేశాల్లో పాకిస్తాన్ ఆరో స్థానంలో ఉంది.
తాజావార్తలు
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Oscars Academy :’RRR’ ఎడిటర్‌కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్‌కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!