Site icon NTV Telugu

Donald Trump: ఇటలీ ప్రధాని మెలోనీ అంటే నాకు చాలా ఇష్టం..

Trump

Trump

Donald Trump: ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ అంటే తనకు చాలా ఇష్టమని అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. మెలోనీ గొప్ప ప్రధాని, వ్యక్తిగతంగానూ ఆవిడతో నాకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నారు. మెలోనిలో చాలా ప్రతిభ ఉంది, ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఆమె ఒకరంటూ అతడు కొనియాడారు. ఇక, టారిఫ్స్ పెంపుపై అమెరికా వైఖరిని జార్జియా మెలోనీ వ్యతిరేకించినా.. యూరోపియన్ దేశాల నుంచి డొనాల్డ్ ట్రంప్ ని కలిసిన తొలి ప్రధాన మంత్రి ఆవిడే.

Read Also: Realme 14T 5G: 6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్ తో ఏప్రిల్ 25న లాంచ్ కానున్న రియల్‌మీ 14T 5G

కాగా, గురువారం నాడు వైట్ హౌస్‌లో ఇటాలి ప్రధాని జార్జియా మెలోనితో డొనాల్డ్ ట్రంప్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా యూరోపియన్ యూనియన్‌తో 100 శాతం వాణిజ్య ఒప్పందం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. వాణిజ్య సుంకాలపై కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ట్రంప్ ఈ సాహసోపేతమైన ప్రకటనను విడుదల చేశారు. దీంతో ఆయన మొదట ఈయూ దిగుమతులపై విధించిన 20 శాతం సుంకం.. 90 రోజుల పాటు నిలిపివేయబడింది. అలాగే, ఇతర దేశాలతో బహుళ వాణిజ్య ఒప్పందాలు త్వరలో జరగవచ్చని సూచించారు. ప్రతి ఒక దేశంతో ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నామని ట్రంప్ వెల్లడించారు.

Exit mobile version