Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరికొన్ని రోజుల్లో పదవి నుంచి దిగిపోనున్నారు. ఈ క్రమంలో తన అధ్యక్ష పదవీ కాలంలో అమలు చేసిన ఆర్థిక విధాలను గురించి బైడెన్ మాట్లాడుతూ.. 2020లో కరోనా మహమ్మారి విజృంభణ స్టార్టింగ్ లో బాధితులకు అందజేసిన రిలీఫ్ చెక్స్‌పై డొనాల్డ్ ట్రంప్ తన పేరు రాసుకుని మంచి పేరును సంపాదించుకున్నాడని ఆయన తెలిపారు. కానీ, ఆ మరుసటి ఏడాది అధ్యక్ష పదవి చేపట్టిన.. ట్రంప్ లాగా నేను చేయలేకపోయానని చెప్పుకొచ్చారుు. తానో ‘స్టుపిడ్’ అని అంటూ అతడు విచారం వ్యక్తం చేశారు. మరోవైపు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఆధునిక చరిత్రలో బలమైన ఆర్థిక వ్యవస్థను అందుకుంటారని చెప్పుకొచ్చారు. ఆయన శ్వేతసౌధానికి వచ్చిన తర్వాత డెమోక్రట్లు విధానపరమైన ఆలోచనలను కొనసాగించేందుకు ట్రై చేయాలని జో బైడెన్ సవాల్ విసిరారు.
Read Also: Syria: సిరియా నుంచి ఇండియాకు బయల్దేరిన భారతీయ పౌరులు.. ప్రస్తుతం ఎక్కడున్నారంటే?
కాగా, విదేశీ దిగుమతులపై పన్నులు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ చెప్పడాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తప్పుబట్టారు. ఆర్థిక వ్యవస్థ, విద్యా విధానం, పౌర హక్కులు, వలసలకు సంబంధించిన అంశాలపై ట్రంప్ మద్దతుదారులు ముందుకు తెస్తున్న ప్రాజెక్ట్-2025ను ప్రెసిడెంట్ ఖండించారు. కాబోయే అధ్యక్షుడు ప్రాజెక్ట్- 2025ను క్యాన్సిల్ చేయాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అని ఆయన పేర్కొన్నారు. ఇది ఆర్థిక విపత్తుగా భావిస్తున్నాం.. ఫెడరల్ ప్రభుత్వాన్ని పూర్తిగా మార్చాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్- 2025 అనే పాలసీని డొనాల్డ్ ట్రంప్ సన్నిహితులు తీసుకోచ్చారని జో బైడెన్ ఆరోపించారు.