Site icon NTV Telugu

Pakistan: పాక్ అణు కమిషన్ కార్యాలయం వద్ద భారీ పేలుడు.!

Pakistan

Pakistan

Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ వరుస పేలుళ్లతో వణికిపోతోంది. బలూచిస్తాన్ పేలుళ్లలో 50 మందికి పైగా ప్రజలు చనిపోయిన తర్వాత మరో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పాకిస్తాన్ అణు కమిషన్ కార్యాలయం వద్ద పేలుడు జరిగింది. పంజాబ్ ప్రావిన్సులోని డేరా ఘాజీఖాన్ ప్రాంతంలోని అణు కమిషన్ కార్యాలయం వద్ద భారీ పేలుడు దేశాన్ని కుదిపేసింది. ఈ పేలుడు శబ్ధం దాదాపుగా 30-50 కిలోమీటర్ల వరకు వినిపించినట్లు సమాచారం. పక్కనే ఉన్న బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ప్రావిన్సులోని పలు ప్రాంతాలకు శబ్ధం వినిపించింది.

Read Also: Putin: రష్యా నుంచి భారత్‌ని దూరం చేసే ప్రయత్నాలు ఫలించవు..

సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియో ప్రకారం.. పేలుడు జరిగిన ప్రాంతానికి అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు, పోలీసు వాహనాలు వెళ్తున్నట్లు చూపిస్తోంది. అయితే పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రాణానష్టం, ఆస్తినష్టం ఇంకా నిర్ధారణ కాలేదు.

వారం క్రితం బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఏకంగా అటామిక్ కమిషన్ కార్యాలయం దగ్గర పేలుడు సంభవించింది. గత వారం జరిగిన బలూచిస్తాన్, ఖైబర్ ఆత్మాహుతి దాడుల్లో 65 మంది మరణించారు. మహ్మద్ ప్రవక్త పుట్టిన రోజును పురస్కరించుకుని ఊరేగింపు కోసం ప్రజలు గుమిగూడిన సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో మసీదులో పేలుడు సంభవించింది.

Exit mobile version