Site icon NTV Telugu

Israeli flight: థాయ్‌లాండ్ నుంచి ఇజ్రాయిల్ వెళ్తున్న ఫ్లైట్ హైజాక్‌కి యత్నం..

Israel

Israel

Israeli flight: ఇజ్రాయిల్‌కి వెళ్తున్న ఓ విమానాన్ని దారి మళ్లించి హైజాక్ చేసే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ ఎయిర్‌క్రాఫ్ట్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌పై దాడి జరిగింది. దుండగులు విమానాన్ని దారి మళ్లించేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. హౌతీలు యాక్టివ్‌గా ఉన్న ఏరియాలో ఈ ఘటన జరిగింది. థాయ్‌లాండ్ ఫుకెట్ నుంచి ఇజ్రాయిల్ బెన్-గురియన్ విమానాశ్రయానికి వెళ్తున్న విమానం కమ్యూనికేషన్ నెట్వర్క్ దాడికి గురైనట్లు ఇజ్రాయిల్ మీడియా ఆదివారం నివేదించింది. దాడి చేసిన వ్యక్తుల విమాన సిగ్నలింగ్ వ్యవస్థను స్వాధీనం చేసుకుని దాని గమ్యాన్ని మార్చేందుకు యత్నించారు.

Read Also: Pakistan: పాక్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. నేడు ఇరుపక్షాలు నాలుగో విడత భేటీ

అయితే, ఎలాంటి ప్రమాదం లేకుండా విమానం గమ్యస్థానానికి చేరుకుందని ఇజ్రాయిల్ మీడియా తెలిపింది. దాని వెనక శత్రువులు ఉన్నారని పేర్కొంది. ఈ ఘటనను ఇప్పటి వరకు ఇజ్రాయిల్ అధికారులు మాత్రం ధ్రువీకరించలేదు. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగబాటుదారులు ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇలాంటి ఘటన జరగడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. అనుమానాస్పద ఆదేశాలతో అప్రమత్తమైన విమాన సిబ్బంది, వారి ఆదేశాలను పాటించలేదు. గత వారం ఇలాగే బ్యాంకాక్ వెళ్తున్న విమానాన్ని కూడా దారి మళ్లించే ప్రయత్నం చేశారు.

Exit mobile version