Hindu temple vandalised: కెనడాలో మరోసారి హిందూ ఆలయంపై దుండగులు దాడి చేశారు. భారత వ్యతిరేక రాతలతో గుడిని ధ్వంసం చేశారు. నాలుగు నెలల్లో రెండోసారి ఇలాంటి ఘటన జరిగింది. ఒంటారియోలో బుధవారం ఈ ఘటన జరిగింది. జనవరి 31న ఇలాగే బ్రాంప్టన్ లో హిందూ దేవాలయంపై దాడి చేశారు. తాజాగా జరిగిన దాడికి సంబంధించి ఇద్దరు అనుమానితులు దేవాలయంపై పెయింటిగ్ స్ప్రే చేస్తున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ ఘటనను ద్వేషపూరిత ఘటనగా భావించి దర్యాప్తు చేస్తున్నట్లు విండ్సర్ పోలీసులు వెల్లడించారు.
Read Also: Annamalai: “రాహుల్ గాంధీకి స్వరా భాస్కర్ గులాబీలు ఇచ్చారు”.. సుదీప్ చేరికపై అన్నామలై..
దేవాలయం వెలుపలి గోడలపై ‘‘హిందూస్థాన్ ముర్దాబాద్’’, ‘‘మోదీ టెర్రరిస్ట్ గా ప్రకటించాలి’’ అనే వ్యాఖ్యలను రాశారు. బుధవారం అర్దరాత్రి 12 గంటల తర్వాత ఈ ఘటన జరిగింది. పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు. ఇటీవల కాలంలో కెనడాలో భారత వ్యతిరేక కార్యక్రమాలు పెరిగాయి. ముఖ్యంగా ఖలిస్తాన్ మద్దతుదారులు భారత్ కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. ఖలిస్తానీ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసులు వేట కొనసాగుతున్న సమయంలో కెనడాలోని భారత రాయబార కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.
ఖలిస్తాన్ రిఫరెండం పేరుతో కెనడాలో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరోవైపు బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికాల్లో పలువురు ఖలిస్తానీ వేర్పాటువాదులు భారత్ కు వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటన్నింటిపై ఆయా దేశాలకు భారత ప్రభుత్వం తన అభ్యంతరం తెలిపింది.