NTV Telugu Site icon

Pakistan: పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 64 ఏళ్ల నాటి హిందూ దేవాలయం పునర్నిర్మాణానికి శ్రీకారం

Pakistan

Pakistan

పాకిస్థాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 64 ఏళ్ల నాటి హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించడానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.కోటి బడ్జెట్ కేటాయించినట్లు సోమవారం మీడియాకు తెలిపింది. పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ హిందూ దేవాలయం 1960 నుంచి పని చేయకుండా పోయింది. మొత్తానికి ఇన్నాళ్లకు మోక్షం లభించింది.

ఇస్లామిక్‌ దేశమైన పాకిస్తాన్‌లో హిందువుల జనాభా గణనీయంగా తగ్గిపోతుంది. హిందూ ఆలయాలు దాడులకు గురికావడంతో దెబ్బతిన్నాయి. అయితే హిందువులు గుడికి వెళ్లాలంటే లాహోర్ లేదా సియాల్‌కోట్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో గుడిని పునర్నిర్మించాలని పాక్‌ ధర్మస్థాన్‌ కమిటీ 20 ఏళ్ల క్రితమే సిఫారసు చేసింది. మొత్తానికి ఇన్నాళ్లకు అక్కడ ప్రభుత్వం నరోవల్‌ జిల్లాలోని బావోలీ సాహిబ్‌ గుడిని పునర్నిర్మించడానికి సిద్ధపడింది.

ఇది కూడా చదవండి: Currncy Notes in Drain: మురికి కాలువలో రూ.500 నోట్లు.. ఎగబడిన జనం

ప్రస్తుతం గుడి నిర్మాణాన్ని ద ఎవాక్యూ ట్రస్ట్‌ప్రాపర్టీ బోర్డు(ఈటీపీబీ) పర్యవేక్షిస్తోంది. గుడి పూర్తయిన తర్వాత దీన్ని ధర్మస్థాన్‌ బోర్డుకు అప్పగిస్తారు. పాక్‌ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన షోయబ్‌ సిద్దాల్‌ నేతృత్వంలోని ఏక సభ్య కమిటీ చైర్మన్‌ షోయబ్‌ సిద్దాల్‌, నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిటీ సభ్యుడు మంజూర్‌ మసీ గుడి పునర్నిర్మించేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. గుడిని మళ్లీ నిర్మిస్తున్నందుకు పాక్‌ ధర్మస్థాన్‌ కమిటీ అధ్యక్షుడు సావన్‌ చంద్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి: The Raja Saab: గళ్ళ కోటు.. నల్ల ఫ్యాంటు.. టీ షర్ట్..బాబు లుక్ అదిరిందంతే!

అధికారిక అంచనాల ప్రకారం పాకిస్థాన్‌లో 75 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. సమాజం ప్రకారం దేశంలో 90 లక్షల మంది వరకు హిందువులు నివసిస్తున్నారు. హిందూ జనాభా ఎక్కువ మంది పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో స్థిరపడ్డారు. తోటి ముస్లిం వారితో సంస్కృతి, సంప్రదాయాలు, భాషను పంచుకుంటారు. పాకిస్తాన్‌లో హిందువులు అతిపెద్ద మైనారిటీ కమ్యూనిటీగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: Mohammed Shami: షమీ ఫిట్‌నెస్‌పై బిగ్ అప్‌డేట్.. ఆస్ట్రేలియా టూర్‌కు స్టార్ బౌలర్..!