NTV Telugu Site icon

Putin: పుతిన్‌ని విమర్శించిన సీనియర్ సైనిక అధికారి మృతి..

Russia

Russia

Putin: రష్యా అధినేత పుతిన్‌ని విమర్శించిన సీనియర్ మిలిటరీ జనరల్ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. లెఫ్టినెంట్ జనరల్ స్విరిడోవ్, స్టావ్‌రోపోల్ ప్రాంతంలోని అతని ఇంటిలో చనిపోయినట్లు రష్యన్ మీడియా తెలియజేసింది. 6వ వైమానికదళం, ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వ్లాదిమిర్ స్విరిడోవ్ మృతదేహాన్ని బుధవారం కనుగొన్నారు. ఇతని శవం పక్కనే ఒక మహిళ శవం పడిఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఎవరనేదానిని ఇంకా గుర్తించలేదు. ఇతర మీడియా నివేదికల ప్రకారం ఆమె అతని భార్య అని చెబుతున్నారు. అయితే చనిపోయే ముందు ఎలాంటి పెనుగులాట, హత్యకు సంబంధించిన ఆనవాళ్లు లభించలేదని, ఎలా చనిపోయారనే దానిని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గదిలో ఎలాంటి విషపూరిత పదార్థాల ఆనవాళ్లు దొరలేదని రష్యా అధికారులు తెలిపినట్లు మీడియా నివేదించింది.

Read Also: Business News: పెళ్లిళ్ల సీజన్‌పై వ్యాపారవేత్తల కళ్లు.. 25 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా..!

గతంలో ఈ ఆర్మీ అధికారి పుతిన్ తీరుపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. రష్యన్ మ్యాగజూన్ టేక్ఆఫ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశంలోని పైలెట్లకు తగిన శిక్షణ ఇవ్వడం లేదని చెప్పారు. పూర్తి పోరాట సంసిద్ధత కోసం పైలెట్ ఏడాదికి 100 గంటల ఫ్లైట్ టైమ్ ఉండాలి, అయితే ప్రస్తుతం సైన్యంలో సగటు ఫ్లైట్ టైమ్ 25-30 గంటలుగా ఉందని ఆరోపించారు. మంచివారు లేనందున పూర్తి శిక్షణ లేని అధికారులను నియమించాల్సి వస్తోందని, అదే కారణంగా మేము మిలిటరీ అకాడమీలోని థర్డ్ ర్యాంక్ పైలెట్లను పంపుతున్నామని, ఇది గతంలో ఎప్పుడూ జరగలేదని అన్నారు.

లెఫ్టినెంట్ జనరల్ స్విరిడోవ్ తన కెరీర్లో ‘ఆర్డర్ ఆఫ్ ది రెడ్ స్టార్’ గౌరవాన్ని అందుకున్నారు. రష్యాలోనే అత్యంత కీలకమైన పైలెట్ అయ్యారు. ఇతను రష్యాలోని పైలెట్ల పేద స్థితిగతుల్ని కూడా హైలెట్ చేశాడు. యువ అధికారులకు, సైనికులందరికీ సాధారణ జీవన పరిస్థితులు సృష్టించమని తద్వారా వారు తమ సేవా విధులను సరిగా నిర్వర్తిస్తారని అధ్యక్షుడు పుతిన్‌కి నేరుగా చెప్పాడు.

Show comments