NTV Telugu Site icon

Israel – Hezbollah: హెజ్‌బొల్లా రాకెట్లతో దాడి.. కూల్చేసిన ఇజ్రాయెల్‌

Hezbolla

Hezbolla

Israel – Hezbollah: ఇజ్రాయెల్‌ మధ్య ప్రాంతంపై హెజ్‌బొల్లా మంగళవారం రాకెట్లతో దాడికి దిగింది. ఇక, వాటిని ఇజ్రాయెల్‌ సైన్యం అడ్డుకుంది. ఒక రాకెట్‌ నిర్మానుష్య ప్రాంతంలో పడగా.. ఒక రిజర్విస్టు సైనికుడు మరణించినట్లు వెల్లడించారు. ఈ దాడుల నేపథ్యంలో 10 లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు సురక్షిత బంకర్లలోకి వెళ్లి పోయారు. అలాగే, విమాన సేవలకు కొంతమేర అంతరాయం కూడా కలిగింది. మరోవైపు సోమవారం రాత్రి ఇజ్రాయెల్‌ చేసిన దాడిలో 13 మంది లెబనాన్‌ వాసులు చనిపోయారు. ఇటు పశ్చిమాసియాలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌.. కాల్పుల విరమణకు అవకాశం తక్కువగా ఉందన్నారు. హెజ్‌బొల్లా మంగళవారం ఇజ్రాయెల్‌లోని జన సమర్థ ప్రాంతాలపై రాకెట్‌ దాడులు చేసినప్పటికి.. ఎలాంటి నష్టం జరగలేదని ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. బ్లింకెన్‌ ఇజ్రాయెల్‌కు రావడానికి కొద్ది గంటల ముందు ఈ దాడులు కొనసాగాయి.

Read Also: Devara : NTR పడిన కష్టానికి ఆడియెన్స్ ‘లాల్ సలామ్’

ఇక, లెబనాన్‌ నుంచి హెజ్‌బొల్లా గ్రూప్ 5 ప్రొజెక్టైల్స్‌ను ప్రయోగించింది. వాటిలో ఒక్కటి మినహా అన్నింటినీ క్షిపణి రక్షణ వ్యవస్థ అడ్డుకుందని ఇజ్రాయెల్‌ ఆర్మీ చెప్పుకొచ్చింది. ఒకటి నిర్మానుష్య ప్రాంతంలో పడగా.. దీని కారణంగా బెన్‌ గురియన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం కలిగిందన్నారు. బీరుట్‌లోని ప్రధాన ఆసుపత్రి ప్రాంతంలో సోమవారం రాత్రి ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 13 మంది చనిపోయారని లెబనాన్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో 57 మంది గాయపడ్డారని చెప్పుకొచ్చింది.