Hassan Nasrallah: హిజ్బుల్లాను చావు దెబ్బ తీసింది ఇజ్రాయిల్. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా బీరూట్‌పై జరిగిన వైమానికి దాడుల్లో మరణించినట్లు ఇజ్రాయిల్ మిలిటరీ ఈ రోజు తెలిపింది. శుక్రవారం రాత్రి జరిగిన దాడుల తర్వాత నస్రల్లాలో కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోయినట్లు ఆ సంస్థ మూలాలు వెల్లడించాయి. “హసన్ నస్రల్లా చనిపోయాడు” అని మిలటరీ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నదవ్ శోషని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇజ్రాయిల్ నిర్వహించిన దాడులు దక్షిణ లెబనాన్‌లోని డజన్ల కొద్దీ హిజ్బుల్లా స్థావరాలనున లక్ష్యంగా చేసుకున్నాయి. హిజ్బుల్లాకు బలమైన కోటలుగా ఉన్న స్థావరాలపై ఇజ్రాయిల్ విరుచుకుపడింది.
Read Also: Firecracker Factory Blast: అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..
‘‘హసన్ నస్రల్లా ఇకపై ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేయలేరు’’ అని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఒక ప్రకటనలో వెల్లడించింది. “ఇది మా టూల్‌బాక్స్ ముగింపు కాదు. సందేశం చాలా సులభం, ఇజ్రాయెల్ పౌరులను బెదిరించే ఎవరైనా — వారిని ఎలా చేరుకోవాలో మాకు తెలుస్తుంది” అని లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి ఒక ప్రకటనలో తెలిపారు. అంతకుముందు దాడుల్లో నస్రల్లా కుమార్తె జైనాబ్ దక్షిణ బీరూట్‌లోని హిజ్బుల్లా స్థావరంలో ఉండగా, వైమానిక దాడుల్లో మరనించారని ఇజ్రాయిల్ మీడియా పేర్కొంది.
ఇదిలా ఉంటే, 2006లో కూడా లెబనాన్‌పై దాడుల్లో నస్రల్లా మరణించినట్లు పుకార్లు వచ్చాయి. అయితే కొన్ని రోజుల తర్వాత ఆయన మళ్లీ కనిపించారు. మరోవైపు హిజ్బుల్లా కీలక వ్యవస్థలను ఇజ్రాయిల్ దాదాపుగా దెబ్బతీసింది. నస్రల్లా తర్వాత కింది స్థాయిలో ఉన్న కమాండర్లను ఒక్కొక్కరిగా హతమార్చింది. ఫువాద్ షుక్ర్, ఇజ్రహీం అకిల్ వంటి వారిని చంపేసింది. ప్రస్తుతం నస్రల్లా చనిపోతే దాదాపుగా హిజ్బుల్లా అంతమైనట్లే. గత 10 రోజుల నుంచి ఇజ్రాయిల్ లెబనాన్‌పై జరిపిన దాడుల్లో దాదాపుగా 700 మంది మరణించారు. 118000 మంది నిరాశ్రయులయ్యారు.