Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Hezbollah Chief Hassan Nasrallah Killed In Strikes On Beirut Israel Army

Hassan Nasrallah: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం.. ఇజ్రాయిల్ ఆర్మీ కన్ఫార్మ్..

Published Date :September 28, 2024 , 2:50 pm
By Venu Goapl Reddy
  • హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఖతం..
  • ప్రకటించిన ఇజ్రాయిల్ ఆర్మీ..
  • బీరూట్ వైమానిక దాడుల్లో చనిపోయినట్లు ప్రకటన..
Hassan Nasrallah: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం.. ఇజ్రాయిల్ ఆర్మీ కన్ఫార్మ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hassan Nasrallah: హిజ్బుల్లాను చావు దెబ్బ తీసింది ఇజ్రాయిల్. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా బీరూట్‌పై జరిగిన వైమానికి దాడుల్లో మరణించినట్లు ఇజ్రాయిల్ మిలిటరీ ఈ రోజు తెలిపింది. శుక్రవారం రాత్రి జరిగిన దాడుల తర్వాత నస్రల్లాలో కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోయినట్లు ఆ సంస్థ మూలాలు వెల్లడించాయి. “హసన్ నస్రల్లా చనిపోయాడు” అని మిలటరీ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నదవ్ శోషని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇజ్రాయిల్ నిర్వహించిన దాడులు దక్షిణ లెబనాన్‌లోని డజన్ల కొద్దీ హిజ్బుల్లా స్థావరాలనున లక్ష్యంగా చేసుకున్నాయి. హిజ్బుల్లాకు బలమైన కోటలుగా ఉన్న స్థావరాలపై ఇజ్రాయిల్ విరుచుకుపడింది.

Read Also: Firecracker Factory Blast: అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..

‘‘హసన్ నస్రల్లా ఇకపై ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేయలేరు’’ అని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఒక ప్రకటనలో వెల్లడించింది. “ఇది మా టూల్‌బాక్స్ ముగింపు కాదు. సందేశం చాలా సులభం, ఇజ్రాయెల్ పౌరులను బెదిరించే ఎవరైనా — వారిని ఎలా చేరుకోవాలో మాకు తెలుస్తుంది” అని లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి ఒక ప్రకటనలో తెలిపారు. అంతకుముందు దాడుల్లో నస్రల్లా కుమార్తె జైనాబ్ దక్షిణ బీరూట్‌లోని హిజ్బుల్లా స్థావరంలో ఉండగా, వైమానిక దాడుల్లో మరనించారని ఇజ్రాయిల్ మీడియా పేర్కొంది.

ఇదిలా ఉంటే, 2006లో కూడా లెబనాన్‌పై దాడుల్లో నస్రల్లా మరణించినట్లు పుకార్లు వచ్చాయి. అయితే కొన్ని రోజుల తర్వాత ఆయన మళ్లీ కనిపించారు. మరోవైపు హిజ్బుల్లా కీలక వ్యవస్థలను ఇజ్రాయిల్ దాదాపుగా దెబ్బతీసింది. నస్రల్లా తర్వాత కింది స్థాయిలో ఉన్న కమాండర్లను ఒక్కొక్కరిగా హతమార్చింది. ఫువాద్ షుక్ర్, ఇజ్రహీం అకిల్ వంటి వారిని చంపేసింది. ప్రస్తుతం నస్రల్లా చనిపోతే దాదాపుగా హిజ్బుల్లా అంతమైనట్లే. గత 10 రోజుల నుంచి ఇజ్రాయిల్ లెబనాన్‌పై జరిపిన దాడుల్లో దాదాపుగా 700 మంది మరణించారు. 118000 మంది నిరాశ్రయులయ్యారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hassan Nasrallah
  • Hezbollah
  • Hezbollah Chief Hassan Nasrallah Killed
  • Israel
  • israel army

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions