Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్.. ప్రాణాలతో ఉండాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో కూలిపోయినట్లు ఇరాన్ అధికారులు చెబుతున్నారు. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ కూడా తప్పిపోయారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ని గుర్తించేందుకు రెస్క్యూ సిబ్బంది విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలుస్తోంది. ‘‘మేము ఇంకా ఆశాజనకంగానే ఉన్నాము. అయితే క్రాష్ సైట్ నుంచి వస్తున్న సమాచారం చాలా ఆందోళన కలిగిస్తోంది’’ అని విషయం తెలిసిన అధికారి చెప్పారు. ఆదివారం రోజు హెలికాప్టర్ అజర్ బైజాన్ సరిహద్దు నుంచి తిరిగి వస్తుండగా దట్టమైన పొగమంచు వల్ల పర్వత ప్రాంతాల్లో కూలిపోయినట్లు ఇరాన్ అధికారి రాయిటర్స్‌కి తెలిపారు. మరోవైపు దట్టమైన పొగమంచు సహాయచర్యల్ని క్లిష్టతరం చేస్తోందని ఆ దేశ మీడియా వెల్లడించింది.
Read Also: PM Modi: మోడీకి ఓటేయొద్దని విద్యార్థులకు చెబుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి అరెస్ట్..
Also Read
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- PM Modi: ఉజ్బెకిస్థాన్‌కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
- Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
ఇదిలా ఉంటే తమ ప్రియతమ నేత ప్రాణాలతో తిరిగి రావాలని ఇరాన్ వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు. 63 ఏళ్ల ఇబ్రహీం రైసీ 2021లో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ దేశ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత శక్తివంతమైన నేతగా ఆయనకు పేరుంది. ఆదివారం ఉదయం అజర్బైజాన్-ఇరాన్ ఉమ్మడి ప్రాజెక్టైన క్విజ్-ఖలైసీ డ్యామ్ ప్రారంభించేందుకు రైసీ అజర్బైజాన్ సరిహద్దు ప్రాంతానికి వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!