NTV Telugu Site icon

Nepal: నేపాల్‌ను ముంచెత్తిన వరదలు.. 20 మంది మృతి

Naprl

Naprl

నేపాల్‌‌ను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, పిడుగులు పడటంతో 20 మంది చనిపోయారు. ఖాట్మండుకు పశ్చిమాన 125 కి.మీ దూరంలో ఉన్న లామ్‌జంగ్ జిల్లాలో రాత్రిపూట కొండచరియలు విరిగిపడటంతో 3 ఇళ్లు కొట్టుకుపోయాయని, ఇద్దరు చిన్నారులతో సహా 4 మంది మరణించారని జిల్లా పాలనాధికారి బుద్ధ బహదూర్ గురుంగ్ తెలిపారు. గత రెండు రోజులుగా పిడుగుపాటుకు మరో తొమ్మిది మంది మరణించారని అధికారులు బుధవారం తెలిపారు. మొత్తం ఇప్పటివరకు 20 మంది చనిపోయినట్లుగా వెల్లడించారు.

ఇది కూడా చదవండి: 14 Movie: హీరోగా సింగర్ నోయల్.. 14 అంటూ వస్తున్నాడు!

ఇక నేపాలీ రాజధానికి ఆగ్నేయంగా 500 కి.మీ దూరంలో ఉన్న మోరాంగ్ జిల్లాలో మంగళవారం వరదలు కారణంగా నలుగురి ప్రాణాలు పోయాయని జిల్లా అధికారి టెక్ కుమార్ రెగ్మి తెలిపారు. ఇక పశ్చిమాన కస్కీ మరియు తూర్పు నేపాల్‌లోని ఓఖల్‌ధుంగాలో కొండచరియలు విరిగిపడటంతో మరో ముగ్గురు మరణించారు. రంగంలోకి దిగిన సహాయ సిబ్బంది.. సహాయ చర్యలు చేస్తున్నారు. వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రతి సంవత్సరం వందలాది మంది చనిపోతున్నారు.

ఇది కూడా చదవండి: MLC Jeevan reddy: దీపాదాస్ మున్షీతో ముగిసిన జీవన్ రెడ్డి భేటీ.. కొనసాగుతున్న ఉత్కంఠ..!

Show comments