Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Health At The Mercy Of Fossil Fuels

Global Warming: కరోనాకి మించిన విపత్తు.. 2 నిమిషాలకి ఒకరు దుర్మరణం

Published Date :October 26, 2022 , 10:06 pm
By NTV WebDesk
Global Warming: కరోనాకి మించిన విపత్తు.. 2 నిమిషాలకి ఒకరు దుర్మరణం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Health At The Mercy Of Fossil Fuels: కరోనా వైరస్ కారణంగా ప్రపంచదేశాలు ఎలా వణికిపోయాయో అందరికీ తెలుసు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆర్థిక సంక్షోభంతో చాలా దేశాలు అల్లాడిపోయాయి. ఇప్పటికీ ఈ వైరస్ ప్రభావం కొన్ని దేశాలపై ఉంది. అయితే.. ఈ వైరస్‌కి మించిన మరో విపత్తు, ప్రాణాలను హరిస్తోందని ఓ పరిశోధనలో తేలింది. బొగ్గు, చముకు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలను విపరీతంగా వాడుతుండటంతో.. గ్లోబల వార్మింగ్ పెరిగిపోయి, లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని వెలుగులోకి వచ్చింది. ఒక్క భారత్‌లోనే 2 నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారని ‘ద లాన్సెట్‌ కౌంట్‌డౌన్‌ ఆన్‌ హెల్త్‌ అండ్‌ క్లైమేట్‌ చేంజ్‌’ అనే నివేదిక వెల్లడించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ వంటి 50 సంస్థలకు చెందిన 99 మంది నిపుణులు కలిసి ఈ నివేదనకు రూపొందించారు. పరిస్థితులు ఇప్పుడే ఇంత ఘోరంగా ఉంటే, రానున్న రోజుల్లో మరింత తీవ్ర పరిణామాలు తప్పవని ఆ నివేదిక హెచ్చరిస్తోంది. మరి, ఈ పరిస్థితిని అదుపు చేయాలంటే ఎలా? శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలని ఆ నివేదిక సూచిస్తోంది. అలాగే.. ఆరోగ్య కార్యక్రమాలపై మరింత దృష్టిపెట్టాలని ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు సలహా ఇస్తున్నారు. అలా కాకుండా శిలాజ ఇంధనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే మాత్రం.. ఆహార భద్రత, అంటు వ్యాధుల వ్యాప్తి, ఉష్ణోగ్రత వల్ల కలిగే వ్యాధులు, విద్యుత్తు సంక్షోభం, గాలి కాలుష్యం వంటివి విపరీతంగా పెరిగిపోయి, మహా విపత్తు తలెత్తుతుందని హెచ్చరిస్తున్నారు. అప్పుడు మరణాల రేటు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి.. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే వినాశనం తప్పదని చెప్తున్నారు.

ఈ శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఏర్పడే కాలుష్యం కారణంగా.. గతేడాదిలో భారత్‌లో 3,30,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ నివేదిక వెల్లడించింది. దాన్ని బట్టి.. ప్రతి 2 నిమిషాలకు 1.2 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. గతేడాదిలోనే చైనాలో 3,80,000 మరణాలు సంభవించగా.. ఐరోపాలో 1,17,000 మంది, అమెరికాలో 32 వేల మంది మరణించారు. ఈ శతాబ్దం చివరి నాటికి గ్లోబల్ వార్మింగ్ 2.7 డిగ్రీల సెల్సియస్‌ పెరగనుందని.. ప్రస్తుతం 1.1 డిగ్రీ సెల్సియస్‌ ఉన్నందుకే ప్రపంచం అతలాకుతలమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ దేశాలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈ సమస్యని గాలికొదిలేస్తే మాత్రం.. గ్లోబల్ వార్మింగ్ మరింత పెరిగి, దారుణమైన పరిస్థితుల్ని చవిచూడాల్సి వస్తుందంటున్నారు. శిలాజ ఇంధనాలకు రాయితీలు ఇవ్వడం తగ్గించాలని సూచిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Fossil Fuels
  • Global Warming
  • The Lancet Countdown Report
  • World Health Organization
  • World Meteorological Organization

తాజావార్తలు

  • Varanasi: క్లైమాక్స్‌కు చేరువలో ‘వారణాసి’..హైదరాబాద్ శివార్లలో షూటింగ్

  • Iran War: యూఏఈపై 450 క్షిపణి, 2,000 డ్రోన్ దాడులు.. అయినా యూఏఈ ఇరాన్‌తో ఎందుకు పోరాడటం లేదు..?

  • Tamil Nadu Elections: తమిళనాడులో గెలిచేదెవరు.? తాజా సర్వేలో సంచలన ఫలితాలు..

  • Viral News: ‘పోలీస్ మామల స్క్వాడ్’.. మందుబాబుల వాట్సాప్ గ్రూప్‌లో షాకిచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ

  • Botsa Satyanarayana: అమరావతిపై తీర్మానం చేసినంత మాత్రాన పర్మినెంట్‌ కాదు.. బొత్స సంచలనం

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions