NTV Telugu Site icon

Hamas: హమాస్ బందీలను విడుదల చేస్తుంది.. థాయ్ రాజకీయ నేత కీలక వ్యాఖ్యలు..

Hamas

Hamas

Hamas: గాజాలో హమాస్ బందీలపై థాయ్‌లాండ్ రాజకీయ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యవర్తుల సంధి కుదిరితే, విడుదలయ్యే బందీల్లో థాయ్ దేశానికి చెందిన వారంతా ఉంటారని, ఇలా పాలస్తీనా మిలిటెంట్ సంస్థ తమకు హమీ ఇచ్చిందని థాయ్-ముస్లిం రాజకీయ నేతలు గురువారం తెలిపారు. ఏదైనా కాల్పుల విరమణ జరిగితే 3-5 రోజుల్లో బందీలను విడుదల చేస్తుందని, అందులో థాయ్ ప్రజలు ఉంటారని థాయ్-ఇరాన్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు లెపాంగ్ సయ్యద్ బ్యాంకాక్ పార్లమెంట్ భవనంలో మీడియాతో వెల్లడించారు.

అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి ఊచకోతకు పాల్పడ్డారు. 1400 మందిని చంపేశారు. చిన్న పిల్లలు, మహిళలు అని చూడకుండా.. అత్యాచారాలు చేయడంతో పాటు తలలు నరికేశారు. ఇదే కాకుండా 240 మందిని బందీలుగా పట్టుకున్నారు. కిడ్నాప్‌కి గురైన వారిలో 25 మంది థాయ్‌లాండ్‌కి చెందిన వారు ఉన్నారు. దాడుల సమయంలో 39 మంది మరణించినట్లు ఆ దేశ విదేశాంగా శాఖ వెల్లడించింది.

Read Also: sunitha krishnan: టెలిగ్రామ్‌, పేటీఎం, ఫోన్‌పే యాప్‌లపై చర్యలు తీసుకోవాలి.. సునీతాకృష్ణన్‌

అక్టోబర్ నుంచి హమాస్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పీకర్ వాన్ మహ్మద్ నూర్ మాతా నేతృత్వంలోని థాయ్-ముస్లిం రాజకీయ నాయకులు ఏర్పాటు చేసిని కమిటీలో లెపాంగ్ సభ్యుడిగా ఉన్నారు. ఖతార్ మధ్యవర్తులు మూడు రోజుల సంధితో కూడిన ఒప్పందాన్ని కోరుతున్నారు. హమాస్ ఇప్పటి వరకు 50 మంది బందీలను విడుదల చేసింది. ఇజ్రాయిల్ తన వైపు ఉన్న ఖైదీల్లో మహిళలు, మైనర్లను విడుదల చేసింది.

థాయ్ ప్రభుత్వ అంచనాల ప్రకారం 30,000 మంది థాయ్ ప్రజలు ఇజ్రాయిల్ లో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 7200 మంది సొంతదేశానికి వెళ్లారు. థాయ్‌లాండ్ 70 మిలియన్ల జనాభాలో 90 శాతం బౌద్ధులు ఉంటే.. మిగిలిన వారు ముస్లింలు ఉన్నారు.