శనివారం మధ్యాహ్నం 12 గంటల లోపు ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేయాలని హమాస్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. లేకుంటే నరకం చూస్తారని వార్నింగ్ ఇచ్చారు. కానీ ట్రంప్ వ్యాఖ్యలను హమాస్ ఏ మాత్రం ఖాతర్ చేయలేదు. యథావిధిగా శనివారం ముగ్గురు బందీలను మాత్రమే విడుదల చేసింది. ముగ్గురు ఇజ్రాయెల్ బందీలైన ఇజ్రాయెల్-అర్జెంటీనా యైర్ హార్న్, ఇజ్రాయెల్-అమెరికన్ సాగుయ్ డెకెల్-చెన్, ఇజ్రాయెల్-రష్యన్ సాషా ట్రౌఫనోవ్‌ను విడుదల చేసింది. ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వం ద్వారా ఒప్పందం జరిగింది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: త్వరలో సూర్యాపేట, గద్వాల్లో భారీ బహిరంగ సభలు..
ముగ్గురు బందీలను గాజాలోని దక్షిణ నగరమైన ఖాన్ యూనిస్‌లోని రెడ్‌క్రాస్‌కు అప్పగించారు. బందీలు ఆరోగ్యంగా ఉన్నట్లుగా కనిపించింది. అంతేకాకుండా బహుమతి సంచులు, సర్టిఫికెట్లు పట్టుకుని కనిపించారు. అయినా కూడా హమాస్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం.. గాజాలోకి సహాయం అందకుండా అడ్డుకుంటోందని ఆరోపిస్తోంది. సహాయ చర్యలు అడ్డుకుంటే బందీల విడుదలను నిలిపివేస్తామని హమాస్ హెచ్చరిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు 19 మంది బందీలను హమాస్ విడుదల చేసింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను హమాస్ పట్టించుకోలేదు. నెక్ట్స్ ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే గాజాను స్వాధీనం చేసుకుంటామని.. పాలస్తీనియన్లు గాజా విడిచి వెళ్లిపోవాలని ట్రంప్ హెచ్చరించారు. తదుపరి చర్యలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: Rakul: కెరీర్ కోసం తిప్పలు తప్పవు : రకుల్ ప్రీత్ సింగ్