NTV Telugu Site icon

Hamas-Israel: హమాస్ గుడ్‌న్యూస్.. రేపు నలుగురు బందీలను విడిచిపెడుతున్నట్లు ప్రకటన

Hamas

Hamas

హమాస్ శుక్రవారం గుడ్‌న్యూస్ చెప్పింది. శనివారం నలుగురు ఇజ్రాయెల్ బందీలను విడిచిపెడుతున్నట్లు హమాస్ స్పష్టం చేసింది. కరీనా అరివ్, డానియెల్లా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్బాగ్‌ను విడుదల చేస్తున్నట్లు ఇజెల్డీన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ప్రతినిధి అబు ఉబైదా తెలిపారు. హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం విడతల వారీగా బందీలను హమాస్ విడిచిపెడుతోంది. గత ఆదివారం ముగ్గురు బందీలను విడిచిపెట్టగా.. శనివారం మరో నలుగురు ఇజ్రాయెల్ బందీలు విడుదల కానున్నారు. విడుదల చేసే నలుగురు పేర్లను హమాస్ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: MG MAJESTOR: ఫార్చ్యూనర్‌కు పోటీగా కొత్త ఎస్‌యూవీ.. లుక్ అదుర్స్

నలుగురు ఇజ్రాయెల్ బందీలు శనివారం మధ్యాహ్నాం విడుదలయ్యే అవకాశం ఉంది. గత శనివారం కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక.. తొలి విడతగా ముగ్గురు ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడిచిపెట్టింది. ఇజ్రాయెల్ కూడా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. రెండో విడతగా హమాస్.. నలుగురిని విడిచిపెడుతోంది. ఇక ఇజ్రాయెల్ కూడా 200 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసే అవకాశం ఉంది. ఇదంతా ఒప్పందంలో భాగంగానే జరుగుతోంది.

ఇది కూడా చదవండి: Kakani Govardhan Reddy: విజయసాయి రెడ్డిపై కొందరు కుట్రలు, కుతంత్రాలు చేశారు..