Hamas: పాకిస్తాన్ “ముజాహిదీన్” భూమి.. మీరే ఇజ్రాయిల్‌ని అడ్డుకోగలరు.. హమాస్ నేత కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hamas: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మళ్లీ మొదలైంది. ఇన్నాళ్లు ఉత్తరప్రాంతానికే పరిమితమైన యుద్ధం, ఇప్పుడు దక్షిణ గాజాపై కూడా ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ యుద్ధంలో, హమాస్ కీలక నేత ఇస్మాయిల్ హనియే పాకిస్తాన్ మద్దతు కోరారు. పాకిస్తాన్ దేశాన్ని ధైర్యవంతుడిగా కొనియాడుతూ.. ఇజ్రాయిల్ పాకిస్తాన్ నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటే, ఆ దేశ క్రూరత్వం ఆడిపోతుందని చెప్పినట్లు ఆ దేశ జియో న్యూ్స్ బుధవారం నివేదించింది. పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ‘అల్-అక్సా మసీదు పవిత్రత, ముస్లి ఉమ్మా యొక్క బాధ్యత’ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో హనీయే ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Kerala doctor Suicide: BMW కారు, బంగారం కట్నంగా ఇవ్వలేదని ఆగిన పెళ్లి.. పెళ్లికూతురు ఆత్మహత్య..
Also Read
- Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
హమాస్‌కి పాకిస్తాన్ మద్దతు ఇస్తుందనే ఆశను వ్యక్తం చేస్తూ.. పాకిస్తాన్‌ని ‘‘ముజాహిదీన్(ఇస్లాం కోసం పోరాడే వ్యక్తుల)భూమి’’ అని కొనియాడారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో పాలస్తీనియన్ల త్యాగాలను చెబుతూ.. పాకిస్తాన్ ఈ వివాదాన్ని సమర్థవంతంగా ఆపగలదని చెప్పారు. పవిత్ర ఖురాన్‌ని అనుసరించే దేశాలు గాజాస్ట్రిప్ లో ఇజ్రాయిల్ దాడిని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ యుద్ధంలో 16 వేల మందిని చంపేశారని, పవిత్ర స్థలాలను అపవిత్రం చేయడంతో సహా ఇజ్రాయిల్ చర్యలు అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడమే అని ఆయన అన్నారు.
ఇజ్రాయిల్-ఇస్లామిక్ దేశాల మధ్య దౌత్య సంబంధాలపై హెచ్చరించారు, ఇది పాలస్తీనాను తీవ్రంగా నాశనం చేస్తుందని హనీయే చెప్పాడు. ఇజ్రాయిల్‌కి మద్దతు ఇస్తున్న అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇజ్రాయిల్ అత్యాధునిక ఆయుధాలను హమాస్ ఎదుర్కొంటోందని, తాము విజయం గురించి కృతనిశ్చయంతో ఉన్నామని హమాస్ నేత వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు యూదులు అతిపెద్ద శత్రువులు అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
KTR: కరెంట్ కోతలపై కేటీఆర్ ఫైర్.. ‘ఇది ఎల్ నినో కాదు.. ఎల్ కాంగ్రెస్’.!
-
YS Jagan: అవినీతి ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి డీఎస్సీనే ఉదాహరణ!
-
SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!