NTV Telugu Site icon

Hamas: పాకిస్తాన్ “ముజాహిదీన్” భూమి.. మీరే ఇజ్రాయిల్‌ని అడ్డుకోగలరు.. హమాస్ నేత కీలక వ్యాఖ్యలు..

Ismail Haniyeh

Ismail Haniyeh

Hamas: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మళ్లీ మొదలైంది. ఇన్నాళ్లు ఉత్తరప్రాంతానికే పరిమితమైన యుద్ధం, ఇప్పుడు దక్షిణ గాజాపై కూడా ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ యుద్ధంలో, హమాస్ కీలక నేత ఇస్మాయిల్ హనియే పాకిస్తాన్ మద్దతు కోరారు. పాకిస్తాన్ దేశాన్ని ధైర్యవంతుడిగా కొనియాడుతూ.. ఇజ్రాయిల్ పాకిస్తాన్ నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటే, ఆ దేశ క్రూరత్వం ఆడిపోతుందని చెప్పినట్లు ఆ దేశ జియో న్యూ్స్ బుధవారం నివేదించింది. పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌‌లో ‘అల్-అక్సా మసీదు పవిత్రత, ముస్లి ఉమ్మా యొక్క బాధ్యత’ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో హనీయే ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Kerala doctor Suicide: BMW కారు, బంగారం కట్నంగా ఇవ్వలేదని ఆగిన పెళ్లి.. పెళ్లికూతురు ఆత్మహత్య..

హమాస్‌కి పాకిస్తాన్ మద్దతు ఇస్తుందనే ఆశను వ్యక్తం చేస్తూ.. పాకిస్తాన్‌ని ‘‘ముజాహిదీన్(ఇస్లాం కోసం పోరాడే వ్యక్తుల)భూమి’’ అని కొనియాడారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో పాలస్తీనియన్ల త్యాగాలను చెబుతూ.. పాకిస్తాన్ ఈ వివాదాన్ని సమర్థవంతంగా ఆపగలదని చెప్పారు. పవిత్ర ఖురాన్‌ని అనుసరించే దేశాలు గాజాస్ట్రిప్ లో ఇజ్రాయిల్ దాడిని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ యుద్ధంలో 16 వేల మందిని చంపేశారని, పవిత్ర స్థలాలను అపవిత్రం చేయడంతో సహా ఇజ్రాయిల్ చర్యలు అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడమే అని ఆయన అన్నారు.

ఇజ్రాయిల్-ఇస్లామిక్ దేశాల మధ్య దౌత్య సంబంధాలపై హెచ్చరించారు, ఇది పాలస్తీనాను తీవ్రంగా నాశనం చేస్తుందని హనీయే చెప్పాడు. ఇజ్రాయిల్‌కి మద్దతు ఇస్తున్న అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇజ్రాయిల్ అత్యాధునిక ఆయుధాలను హమాస్ ఎదుర్కొంటోందని, తాము విజయం గురించి కృతనిశ్చయంతో ఉన్నామని హమాస్ నేత వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు యూదులు అతిపెద్ద శత్రువులు అని పేర్కొన్నారు.