ట్రంప్ ప్లాన్‌పై హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే నరకం చూస్తారని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఎట్టకేలకు హమాస్ దిగొచ్చింది. ట్రంప్ ప్రణాళికకు అంగీకారం తెలిపింది. ట్రంప్ ప్రణాళికలోని కొన్ని అంశాలకు అంగీకరిస్తున్నట్లు హమాస్ శుక్రవారం తెలిపింది. హమాస్ షరతులకు అంగీకరిస్తే వెంటనే గాజాపై బాంబు దాడులు ఆపేయాలని ట్రంప్ శుక్రవారం ఇజ్రాయెల్‌కు సూచించారు.
ఇది కూడా చదవండి: MVG : ‘మన శంకర వరప్రసాద్ గారు’ పై కేర్ పెంచిన మేకర్స్ !
ట్రంప్ ప్రణాళిక ప్రకారం ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించింది. అయితే కొన్ని అంశాల్లోని విషయాలకు చర్చలు జరపాల్సి ఉందని వెల్లడించింది. ఈ చర్చలు వెంటనే జరగాలని.. అందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. శాంతి నెలకొల్పేందుకు అరబ్, ఇస్లామిక్, అంతర్జాతీయ భాగస్వాములతో పాటు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు హమాస్ కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఇజ్రాయెల్ జైల్లో ఉన్న పాలస్తీనా ఖైదీల విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తెలిపింది.
ఇది కూడా చదవండి: Vijay Devarakonda-Rashmika: గుట్టుచప్పుడు కాకుండా.. విజయ్ దేవరకొండ-రష్మిక నిశ్చితార్థం
అక్టోబర్ 7, 2023న హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి 250 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లిపోయారు. అనంతరం ప్రతీకారంగా ఇజ్రాయెల్.. హమాస్‌పై దాడి చేసింది. నాటి నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. మధ్యలో అంతర్జాతీయ మధ్యవర్తుల కారణంగా కొంత మంది బందీలను హమాస్ విడుదల చేసింది. బదులుగా ఇజ్రాయెల్ జైల్లో ఉన్న ఖైదీలను విడుదల చేసింది. ఒకేసారి అందరినీ విడిచి పెట్టాలని ఇజ్రాయెల్ షరతు పెట్టింది. అందుకు హమాస్ ససేమిరా అంది. దీంతో యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను ముందుకు తీసుకొచ్చారు. దీనికి ఇజ్రాయెల్ మద్దతు తెలిపింది. ఇక ఆయా దేశాలు స్వాగతించాయి. కానీ హమాస్ స్పందించలేదు. దీంతో ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు తన ప్రణాళికకు అంగీకారం తెలపకపోతే నరకం చూస్తారని ట్రంప్ హెచ్చరించారు. దీంతో ఎట్టకేలకు హమాస్ దిగొచ్చింది.
