Israel-Hamas war: హమాస్, ఇజ్రాయిల్ మధ్య అక్టోబర్ 7వ తేదీన మోగిన యుద్ధ బేరి నేటితో ముగుస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి కారణం ఇజ్రాయిల్ హమాస్ తో స్వాప్ డీల్ కుదుర్చుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇజ్రాయిల్ హమాస్ తో స్వాప్ డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం హమాస్ దశల వారీగా ఇజ్రాయిల్ బందీలను విడుదల చేస్తుంది. ఒప్పదం కుదుర్చుకున్న నేపథ్యంలో మొదటి దశలో గాజా స్ట్రిప్ నుంచి విడుదల కానున్న బందీల జాబితాను ఇజ్రాయెల్ కు అందించింది. ఈ విషయాన్ని గురువారం ఇజ్రాయిల్ ప్రభుత్వం ధ్రువీకరించింది. అలానే విడుదల కానున్న బందీల సమాచారాన్ని వాళ్ల కుటుంబాలకు తెలియ చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయంలో బందీలు అలానే తప్పిపోయిన వ్యక్తుల సమన్వయకర్త గెయిల్ హిర్ష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read also:Telangana Assembly Elections 2023: ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఈసీ.. పోలింగ్‌కు భారీ ఏర్పాట్లు
కాగా ఈ స్వాప్ డీల్ ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 7 గంటలకు ఇజ్రాయిల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ అందుబాటు లోకి వస్తుంది అని ఖతార్, యుఎస్‌తో పాటు ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించిన ఈజిప్ట్ ధ్రువీకరించింది. ఈ ఒప్పందం ప్రకారం మొదట నాలుగు రోజులు తాత్కాలికంగా కాల్పులను విరమించుకునేందుకు ఇజ్రాయెల్ మరియు హమాస్ బుధవారం అంగీకరించాయి. కుదుర్చుకున్న స్వాప్ ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్‌లో ఉన్న 150 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల ఇజ్రాయెల్ చేయనుంది.. దీనికి బదులుగా హమాస్ తన ఆధీనంలో ఉన్న ఇజ్రాయిల్ బందీలల్లో కనీసం 50 మందిని విడుదల చేయాల్సి ఉంటుంది.