Israel–Hamas war: ఈజిప్టు రాజధాని కైరోలో ఈ రోజు (నవంబర్30) ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై నిర్వహించే చర్చలకు తమ ప్రతినిధులు హాజరవుతారని హమాస్ గ్రూప్ తెలిపింది. అలాగే, ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం, బందీల విడుదలపై ఈజిప్టు అధికారులతో వారు చర్చలు జరుపుతారని చెప్పుకొచ్చింది. కాగా, హమాస్ దగ్గర బందీలుగా ఉన్న తమ దేశ పౌరులు రిలీజ్ చేసిన తర్వాతే కాల్పుల విరమణపై ఆలోచిస్తామని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. ఇటీవలే హెజ్‌బొల్లా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇక, హమాస్ సమస్యకు కూడా త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని.. ఇందుకు ఖతార్, టర్కీ, ఈజిప్టు దేశాల సాయంతో ప్రయత్నిస్తున్నామని అమెరికా వెల్లడించింది.
Read Also: Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్‌లో కుర్రాళ్ల మతిపోగొట్టిన నేషనల్ క్రష్
అయితే, గతేడాది అక్టోబర్7న హమాస్ టెర్రరిస్టులు ఇజజ్రాయెల్‌పై దాడి చేసి వందల మంది ఆ దేశ పౌరులను చంపేశారు. అలాగే, మరి కొందరిని తమతో పాటు బందీలుగా తీసుకుపోయారు. అక్టోబర్ 7 తర్వాత నుంచి గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ చేసింది. ఈ వార్ లో ఇప్పటి వరకు పాలస్తానాలో 40 వేల మందికి పైగా మృతి చెందారు.