Google Most Search News Events in India 2023: ప్రస్తుత కాలంలో గూగుల్ వాడకం బాగా పెరిగింది. ఎవరికి ఎలాంటి సందేహాలు ఉన్న వెంటనే గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో యూజర్లకు మైక్రో సెకన్లలోనే సమగ్ర సమాచారం కళ్లు ముందుంటుంది. అందుకే ప్రతి చిన్న అంశాన్ని కూడా గూగుల్లో వెతికేస్తున్నారు. డైయిలీ నీడ్స్ నుంచి స్పేస్ సమాచారం వరకు గూగుల్‌ల్లో శోధిస్తున్నారు. ఇక ప్రపంచంలో జరిగే స్పెషల్ ఈవెంట్స్‌కు సంబంధించిన సమాచారం కోసం కూడా యూజర్లు ఇంటర్నెట్‌నే వాడేస్తున్నారు. ఈ క్రమంలో ఇయర్ ఎండ్‌లో అత్యధికంగా శోధించిన అంశాలను ప్రతి ఏడాది గూగుల్ ప్రకటిస్తూ వస్తోంది.
Also Read: No Rain Village: ఈ గ్రామమే ఓ అద్భుతం.. వర్షం పడదు.. మేఘాలను చేతితో తాకొచ్చు..
అలాగే ఈ ఏడాదికి సంబంధించిన మోస్ట్ సెర్స్ జాబితా కూడా తాజాగా గూగుల్ రిలీజ్ చేసింది. ఇందులో అత్యధికంగా భారతదేశానికి చెందిన వార్తల అంశాలో మొదటి స్థానంలో నిలవడ విశేషం. 2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది శోధించిన అంశంగా చంద్రయాన్ 3 నిలిచింది. గూగుల్ జాబితా ప్రకారం.. ఈ ఏడాది భారతదేశానికి సంబంధించ వార్త అంశాల్లో చంద్రయాన్ 3 టాప్ వన్‌లో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్స్, ఇజ్రాయేల్ న్యూస్, సత్తీష్ కౌశిక్ మరణం ఉన్నాయి. ఆ తర్వాత 2023 బడ్జెట్ నిలవగా అలాగే టర్కికి చెందిన భూకంపం, అతిక్ అహ్మాద్, నటుడు మ్యాథ్యూ పెర్రీ, మణిపూర్ ఘటనకు సంబంధించిన న్యూస్, ఒడిస్సా రైలు ప్రమాదంకి సంబంధించిన సంఘటనలు ఇండియన్ టాప్ మోస్ట్ సెర్చ్ అంశాలుగా నిలిచినట్టు గూగుల్ తన ప్రకటనలో వెల్లడించింది.
Also Read: Mangalagiri: తాడేపల్లికి మంగళగిరి పంచాయతీ.. తాజా పరిణామాలపై సీఎంతో నేతల భేటీ