IT Layoffs: అమెజాన్, మెటా బాటలో మరో టాప్ టెక్ దిగ్గజం.. 10 వేల ఉద్యోగాలు ఊస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google is in the process of laying off employees: ఐటీ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయింది. వరసగా ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, మెటా, అమెజాన్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు స్పష్టం చేశాయి. అయితే ఇప్పుడు అదే బాటలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కూడా చేరబోతోందని తెలుస్తోంది. వచ్చే ఏడాది గూగుల్ కూడా తన ఉద్యోగులను తొలగిస్తుందని నివేదికలు చెబుతున్నాయి.
తన తోటి టెక్ కంపెనీలు చేపడుతున్న చర్యలనే గూగుల్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. టెక్ న్యూస్ పోర్టల్ ది ఇన్ఫర్మేషన్ ప్రకారం.. సంస్థలో పనిచేస్తున్న 6 శాతం లేదా 10,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు సమాచారం. అంచనాల కన్నా తక్కువ పనితీరును కనబరుస్తున్న ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆ సంస్థ అంతర్గత వర్గాలు తెలిపాయి. ఉద్యోగుల పనితీరు, ర్యాకింగ్స్ కు సంబంధించిన నివేదిక సిద్ధం చేయాలని టీమ్ మేనేజర్లను కోరినట్లు తెలిసింది. 2023 ప్రారంభంలో ఉద్యోగుల తొలగింపు ప్రారంభం అవుతుందని సమాచారం. అంటే గూగుల్ ఉద్యోగుల తొలగింపుకు మరికొన్ని వారాలే ఉందని తెలుస్తోంది. అయితే గూగుల్, ఆల్ఫాబెట్ కానీ తొలగింపుల ప్రణాళికలను నిర్థారించలేదు.
Also Read
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
- US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
Read Also: FIFA World Cup: “రెయిన్ బో” టీ షర్టు ధరించిన జర్నలిస్టు.. నిర్భంధించిన ఖతార్ అధికారులు
అయితే గతంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా తొలగింపులపై పరోక్షంగా సూచనలు చేశారు. తక్కువ వనరులు ఉన్నప్పుడే.. ఉద్యోగుల ప్రొడక్టివిటీ బయటపడుతుందని.. గూగుల్ దీన్నే విశ్వసిస్తుందని గతంలో వ్యాఖ్యానించారు. పలు టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నప్పటికీ.. గూగుల్ మాత్రం ఎలాంటి ఉద్వాసన చర్యలు చేపట్టలేదు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, బయట నుంచి వస్తున్న ఒత్తిళ్ల వల్ల, ఉద్యోగులు ఉత్పాదకత మెరుగుపడటానికి ఉద్యోగులను తీసేస్తారని సమాచారం. వచ్చే ఏడాది కొత్త పనితీరు వ్యవస్థను ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇప్పటికే ట్విట్టర్ 50 శాతం అంటే 3800 మంది ఉద్యోగులను తొలగించింది. ఇదే బాటలో ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా కూడా ఏకంగా 13 శాతం అంటే 11,000 ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. ఇక అమెజాన్ కూడా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇదే బాటలో స్ట్రీమింగ్ దిగ్గజాలు నెట్ ఫ్లిక్స్, డిస్నీ కూడా చేరాయి. ఆర్థిక మాంద్యం పరిస్థితులు, ద్రవ్యోల్భణం కంపెనీల ఆదాాయంపై ప్రభావం చూపిస్తున్నాయి. దీంతోనే ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశ్యంతో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
తాజావార్తలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
-
ఇండియాలో అడుగుపెడుతున్న Apple Pay .. ఫోన్‌పే, జీపేల కథ ఏంటి ?
-
AP Government: జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త.. ఉత్తర్వులు జారీ
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!