Site icon NTV Telugu

Trump: భారత్ గురించి ఆ మాట విన్నాను.. అలా చేస్తే మంచిదే

Trump

Trump

రష్యాతో భారత్ సంబంధాలు పెట్టుకోవడాన్ని అమెరికా ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతుంది. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడం కారణంగానే ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధాన్ని ఆపడం లేదని ట్రంప్ నిత్యం రుసరుసలాడుతూనే ఉంటున్నారు. భారత్ మంచి స్నేహితుడే గానీ.. రష్యాతో సంబంధాలు కారణంగానే 25 శాతం సుంకాలు విధించాల్సి వచ్చిందని ట్రంప్ చెప్పుకొస్తున్నారు. ఆగస్టు 1 నుంచి భారత్‌పై 25 శాతం సుంకం అమల్లోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: Kalabhavan Navas: మలయాళ నటుడు కళాభవన్ నవాస్ అనుమానాస్పద మృతి!

తాజాగా భారత్ గురించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా దగ్గర చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తున్నట్లు విన్నానని.. అలా చేస్తే ఇది చాలా మంచి అడుగు అని ట్రంప్ ప్రశంసించారు. భారతదేశం ఇకపై రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోదని అర్థమవుతుందన్నారు. ఈ మాటే తాను విన్నానని చెప్పుకొచ్చారు. తాను విన్నాది సరైందో కాదో తనకు తెలియదు గానీ.. ఒక వేళ అలా చేస్తే మాత్రం మంచి పరిణామం అన్నారు. ఏం జరుగుతుందో చూద్దాం అని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: OG : పాట లీక్.. సుజీత్ కొంప ముంచిన థమన్ !

ఇటీవల భారత్ గురించి ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా దగ్గర సైనిక పరికరాలు, చమురు కొనుగోలు చేయడాన్ని ట్రంప్ తప్పుపట్టారు. భారతదేశం కారణంగానే రష్యా రెచ్చిపోయి.. ఉక్రెయిన్‌పై దాడి చేస్తోందని పేర్కొన్నారు. తక్షణమే రష్యాతో సంబంధాలు తెంచుకోవాలన్నారు. లేదంటే రక్షణ, ఇంధన ఒప్పందాలు ఇలానే కొనసాగిస్తే ప్రస్తుతం 25 శాతం సుంకం మాత్రమే విధిస్తున్నామని.. భవిష్యత్‌లో జరిమానాలు కూడా ఉంటాయని భారత్‌ను ట్రంప్ హెచ్చరించారు.

 

Exit mobile version