Meloni-Trump: ట్రంప్‌తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
- ట్రంప్‌తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
- ఊహించినంత సులభంగా లేవని వెల్లడి
- జీ7 సదస్సు సందర్భంగా ఇరువురి మధ్య విభేదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంబంధాలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌తో తన సంబంధాలు తాను ఊహించినంత సులభంగా లేవని తేల్చి చెప్పారు. వలసలు, ‘వోక్ కల్చర్’ వంటి అంశాల్లో తమ ప్రభుత్వాల మధ్య సారూప్యతలు ఉన్నందున ట్రంప్‌తో కలిసి పనిచేయడం సులభంగా ఉంటుందని తొలుత భావించానని తెలిపారు.
‘ది న్యూయార్క్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెలోని తన అభిప్రాయాలను వెల్లడించారు. “డొనాల్డ్ ట్రంప్‌తో విషయాలు మరింత సులభంగా ఉంటాయని నేను అనుకున్నాను. వలసలు, వోక్ కల్చర్ వంటి అంశాల్లో మా అభిప్రాయాలు దగ్గరగా ఉండటమే అందుకు కారణం. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి” అని ఆమె పేర్కొన్నారు.
Also Read
- Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
- Indus Waters Treaty: భారత్ నీటిని ఆయుధంగా వాడొచ్చు.. పాక్ మంత్రి ఆరోపణ..
- Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
- France: ఫ్రాన్స్‌లో కండోమ్‌ల కలకలం.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని సలహా..
ఇటీవల జీ7 సదస్సు సందర్భంగా ట్రంప్.. తనతో ఫొటో దిగాలని మెలోని బతిమిలాడారని వ్యాఖ్యానించడంతో ఇరువురు నేతల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై మెలోని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని తెలిపారు. “నేను కానీ.. ఇటలీ కానీ ఎవరినీ బతిమాలుకోం” అని స్పష్టం చేశారు.
అసలు ఏం జరిగింది?
ఇటలీకి చెందిన లా7 టెలివిజన్ ప్రసారం చేసిన వ్యాఖ్యల ప్రకారం.. జీ7 సదస్సులో మెలోనితో తాను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆమెతో మాట్లాడటం కేవలం జాలితోనే జరిగిందని పేర్కొన్నారు. అంతేకాకుండా తనతో ఫొటో దిగాలని మెలోని చాలా పట్టుబట్టారని ట్రంప్ చెప్పినట్లు లా7 వెల్లడించింది. అయితే ఈ వ్యాఖ్యలు డబ్బింగ్ చేసిన ఇంటర్వ్యూ ఆధారంగా ప్రసారం కాగా.. అసలు ఆడియోను ఛానల్ విడుదల చేయలేదు.
ఒకప్పుడు యూరప్‌లో ట్రంప్‌కు అత్యంత బలమైన మద్దతుదారుల్లో మెలోని ఒకరు. 2025లో ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి హాజరైన ఏకైక యూరోపియన్ నేతగా కూడా ఆమె నిలిచారు. అయితే ఇరాన్ యుద్ధానికి సంబంధించి పోప్ లియోపై ట్రంప్ చేసిన విమర్శలను మెలోని తప్పుబట్టడంతో ఇద్దరి మధ్య దూరం పెరగడం ప్రారంభమైంది. దీనిపై ట్రంప్ కూడా మెలోనిపై విమర్శలు గుప్పిస్తూ ఆమెకు ధైర్యం లేదంటూ వ్యాఖ్యానించారు. జీ7 సదస్సు సమయంలో ఇరువురు నేతలు విభేదాలను పక్కన పెట్టినట్లు కనిపించినప్పటికీ.. తాజాగా ఫొటో వివాదం, మెలోని చేసిన వ్యాఖ్యలతో వారి మధ్య సంబంధాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.
తాజావార్తలు
-
Meloni-Trump: ట్రంప్‌తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
-
Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
-
DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!