Meloni: జీ 7 సదస్సులో ధూమపానంపై ఆసక్తికర సంభాషణ.. మెలోనికి అభినందనలు
- జీ 7 సదస్సులో ధూమపానంపై ఆసక్తికర సంభాషణ
- మెలోని సంచలన నిర్ణయం.. నేతలు అభినందనలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటలీ ప్రధాని జార్జియో మెలోని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ 7 సదస్సులో మెలోని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ధూమపానం మానేసినట్లు చెప్పారు. దీంతో ప్రపంచ నేతలంతా మెలోనిని అభినందించారు.
మెలోనికి సిగరెట్ తాగే అలవాటు ఉంది. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. మెలోని సిగరెట్ తాగడం మానేస్తే.. ఇంకా అందంగా ఉంటుందని చెప్పారు. అలాగే ఈజిప్ట్‌లో గాజా శాంతి సదస్సులో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కూడా ధూమపానం మానేయాలని సూచించారు. ‘‘మీరు చూడటానికి బాగున్నారు. కానీ మీరు ధూమపానం మానేయాలని నేను కోరుకుంటున్నాను.’’ అని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఈ వీడియో తెగ వైరల్ అయింది.
Also Read
- Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
- America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
- India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
- Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
అసలేం జరిగిందంటే..
అయితే తాజాగా ఫ్రాన్స్ వేదికగా జీ 7 సదస్సు జరుగుతోంది. ఈ సమ్మిట్‌కు ప్రపంచ నేతలంతా ఒక్క దగ్గర సమావేశం అయ్యారు. మంగళవారం జీ 7 సమావేశం ప్రారంభానికి ముందు అనధికారంగా జరిగిన సంభాషణలో మళ్లీ మెలోని ధూమపానం ప్రస్తావన వచ్చింది. తాను రోజుకు మూడుసార్లు కాఫీ తాగుతానని మెలోని చెప్పుకొచ్చారు. దీనికి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఉదయాన్నేనా? మిమ్మల్ని నిద్రలేపడానికా?.’’ అని అడగ్గా.. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్.. ‘మరి సిగరెట్టా?’ అని బదులిచ్చారు. దీనికి మెలోని స్పందిస్తూ.. ‘‘లేదు.. నేను మానేశాను.’’ అని అన్నారు. అప్పుడు జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి.. ‘‘మీరు ధూమపానం మానేశారా. చాలా మంచి పని.’’ అని అన్నారు. ఉర్సులా వాన్ డెర్ లేయెన్ కూడా.. ‘‘చాలా మంచి పని’’ చేశారంటూ అభినందించారు. అయితే మెలోని వ్యాఖ్యలు దగ్గరలో నిలబడిన రాజకీయ నాయకులను నవ్వించాయి. జర్మన్ ఛాన్సలర్ మెర్జ్.. ‘‘ఏంటి.. నిన్న రాత్రా?’’ అని సరదాగా అడగ్గా.. మెలోని వెంటనే ‘‘నెల రోజుల క్రితం’’ అని బదులిచ్చారు. తాను మే 1వ తేదీ నుంచి పొగత్రాగలేదని మెలోని వివరించారు.
జార్జియా మెలోని 1977లో రోమ్‌లో జన్మించారు. చిన్నతనంలోనే ఆమె తండ్రి ఆమెను, తల్లిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆమె తల్లి ఆమెను ఒంటరిగా పెంచింది. మెలోని 15 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి ప్రవేశించి.. 2006లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. సిగరెట్లు ఆమెకు రాజకీయ నాయకులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి సహాయపడ్డాయి. ‘ఐ యామ్ జార్జియా: మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్.’’ అనే తన పుస్తకంలో 13 సంవత్సరాల క్రితం ధూమపానం మానేసిన తర్వాత తాను మళ్లీ మొదలుపెట్టినట్లు మెలోని వెల్లడించారు. ధూమపానం విదేశీ నాయకులతో మెరుగైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి తనకు సహాయపడిందని సరదాగా మెలోని చెప్పారు.
Italy's Meloni says she quit smoking at G7 Summit. pic.twitter.com/Z3NFztqS6m
— Clash Report (@clashreport) June 16, 2026
🇹🇷🇮🇹 ERDOGAN TO MELONI: I HAVE TO MAKE YOU STOP SMOKING
Erdogan:
"I saw you coming down from the plane.
You look great.
But I have to make you stop smoking."
Meloni:
"I know, I know.
I don't want to kill somebody"
Source: @ihacomtr https://t.co/FX7G3CR5g1 pic.twitter.com/glcfOZAA6Z
— Mario Nawfal (@MarioNawfal) October 13, 2025
తాజావార్తలు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
-
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
-
Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
-
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
-
Ram Mandir Prasad: “రామ మందిర ప్రసాద్ ” అంటూ అమ్మకాలు.. అమెజాన్‌కు రూ. 1 లక్ష జరిమానా.!
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!