Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
- జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి
- రొమేనియా జాతీయుడు అరెస్ట్
- మృతిపై దర్యాప్తు చేస్తోన్న జర్మనీ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జర్మనీలోని బోఖుమ్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ నివాస భవనంలో చెలరేగిన మంటల్లో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి అదే భవనంలో నివసిస్తున్న 41 ఏళ్ల రొమేనియా దేశస్థుడిని పోలీసులు హత్య అనుమానంతో అరెస్ట్ చేశారు. అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగా నిప్పంటించారా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ ప్రమాదంలో 25, 27 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలు, 26 ఏళ్ల యువకుడు మరణించారు. వీరంతా భారతీయులు. మంటలను అదుపు చేసేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది భవనం రెండో అంతస్తులోని ఓ అపార్ట్మెంట్లో మృతదేహాలను గుర్తించారు. ఈ ఘటనలో మరో ఐదుగురు పొగ పీల్చడంతో అస్వస్థతకు గురయ్యారు. కిత్స కోసం బోఖుమ్లోని ఆసుపత్రులకు తరలించారు. అయితే గాయపడిన వారి జాతీయతకు సంబంధించిన వివరాలను స్థానిక మీడియా వెల్లడించలేదు. అగ్నిప్రమాదానికి సంబంధించి పోలీసులు అదే భవనంలో నివసించే 41 ఏళ్ల రొమేనియా దేశస్థుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్య కోణంలో అరెస్ట్ చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
Also Read
ప్రాథమిక దర్యాప్తులో భవనంలో సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగినట్లు కనిపించడం లేదని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఎవరో ఉద్దేశపూర్వకంగా నిప్పంటించి ఉండవచ్చనే అనుమానంతో దర్యాప్తు చేపట్టారు. అయితే మంటలు కావాలనే పెట్టారా? లేక ప్రమాదవశాత్తు చెలరేగాయా? అనే విషయంపై దర్యాప్తు జరుగుతోంది. ముగ్గురు భారతీయుల ప్రాణాలను బలిగొన్న ఈ ఘటనపై జర్మనీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అగ్నిప్రమాదానికి అసలు కారణం, అరెస్టయిన వ్యక్తి పాత్ర, మంటలు ఉద్దేశపూర్వకంగా పెట్టారా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..