Death penalty: 12 రాళ్లను సేకరించినందుకు.. ఏకంగా మరణశిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇతర దేశాల్లో విధించే శిక్షలతో పోలిస్తే ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా వంటి ఇస్లామిక్ దేశాల్లో విధించే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. చిన్న నేరానికే అక్కడ మరణశిక్షలు విధిస్తుంటారు. తాజాగా ఇరాక్‌లో ఓ బ్రిటీషర్ కూడా మరణశిక్షను ఎదుర్కొంటున్నాడు. అయితే అతడు చేసిన నేరం వింటే ఆశ్చర్యం కలగక మానదు. వివరాల్లోకి వెళ్తే జిమ్ ఫిట్టన్ అనే బ్రిటీషర్ ఓ రిటైర్డ్ జియాలజిస్ట్. అతడు జర్మనీకి చెందిన ఓ సైంటిస్టుతో కలిసి ఇరాక్‌లోని ఎరీదు ప్రాంతంలో ఉన్న ఓ పురావస్తు క్షేత్రాన్ని సందర్శించాడు. ఆ పురావస్తు కేంద్రం నుంచి గుర్తుగా 12 పురాతన రాళ్లను, కొన్ని కుండలు, జాడీలకు చెందిన పెంకులను వాళ్లిద్దరూ సేకరించారు.
Big News : మసీదు బావిలో బయటపడ్డ శివలింగం.. ఎక్కడంటే..?
Also Read
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
- Iran War: అమెరికాకు ఇరాన్ షాక్.. కూల్చిన F-15E శకలాలను ప్రపంచానికి చూపించింది.!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
అయితే తమ పురావస్తు సంపదను అక్రమ రవాణా చేస్తున్నారంటూ ఇరాక్ అధికారులు ఫిట్టన్, జర్మనీ సైంటిస్ట్ వాల్డ్ మాన్‌ను మార్చి 20న బాగ్దాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆదివారం నాడు వారిని ఇరాక్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా తాము నేరపూరిత ఉద్దేశాలతో ఆ రాళ్లను సేకరించలేదని జియాలజిస్టులు కోర్టుకు వివరించారు. తమకు ఇరాక్‌లోని చట్టాలు తెలియదని.. అందుకే రాళ్లను సేకరించామని న్యాయమూర్తి ముందు వాపోయారు. పురావస్తు కేంద్రంలో రాళ్లు సేకరించరాదన్న ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో తాము ఈ పని చేశామని తెలిపారు. అయితే ఇరాక్‌లో ఈ నేరం తీవ్రమైనది కావడంతో న్యాయస్థానం మరణశిక్ష విధించింది. కాగా జిమ్ ఫిట్టన్‌ను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలంటూ అతడి కుటుంబ సభ్యులు ఇంగ్లండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఓ పిటిషన్ దాఖలు చేసి సంతకాల సేకరణ ప్రారంభించారు. ఇప్పటివరకు ఫిట్టన్‌కు మద్దతుగా 1.24 లక్షల మంది సంతకాలను వాళ్లు సేకరించారు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!