Free Sanitary Products: మహిళలకు శానిటరీ ప్యాడ్లు ఉచితంగా అందిస్తున్న తొలిదేశం ఇదే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Scotland is first country to give Free Sanitary Products: మహిళలకు తమ జీవిత కాలంలో శానిటరీ ప్యాడ్లు చాలా అవసరం. అయితే ప్రపంచంలో చాలా మంది మహిళలు ఆర్ధిక సమస్యల కారణంగా పీరియడ్స్ ప్రొడక్టులకు దూరంగా ఉంటున్నారు. అయితే మహిళలందరూ నెలసరి విషయంలో పరిశుభ్రత పాటించి తీరాలి. లేకపోతే అనారోగ్యం దరిచేరి ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలిసారి ఓ దేశం మహిళలకు పీరియడ్స్ ప్రొడక్టులకు ఉచితంగా అందజేస్తోంది. ఆగస్టు 15 నుంచే స్కాట్లాండ్ దేశం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్కాట్లాండ్‌లో నేటి నుంచి పీరియడ్స్‌కు సంబంధించిన ప్రొడక్టులన్నీ ఉచితంగా అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు శానిటరీ ప్యాడ్స్, టాంపన్స్, పోషకాహారం బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు ఫ్రీగా లభిస్తాయి.
Read Also: Jio 5G Smart Phone: జియో నుంచి 5జీ స్మార్ట్ ఫోన్.. ధర ఎంత ఉంటుంది?
Also Read
2020లోనే స్కాట్లాండ్ ఉచిత పీరియడ్ ప్రొడక్ట్స్ చట్టాన్ని తెరపైకి తీసుకువచ్చింది. నవంబర్ 2020లో అక్కడి పార్లమెంట్ ఈ చట్టానికి ఏకగ్రీవంగా ఆమోద ముద్ర కూడా వేసింది. ఈ చట్టం ప్రకారం విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి రుసుము లేకుండా శానిటరీ ఉత్పత్తులు అందించబడ్డాయి. ప్రస్తుతం ఈ బిల్లులో సవరణలను అధికారులు ఆమోదించారు. దీంతో దేశంలోని ప్రతి మహిళకు శానిటరీ ఉత్పత్తులు ఉచితంగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఈ చట్టం అమల్లో్కి రావడానికి స్కాట్లాండ్‌లో చాలా పోరాటాలే ఉరిగాయి. కాగా ఉచిత పీరియడ్ ఉత్పత్తులు అందించడం సమానత్వం, గౌరవానికి సంబంధించిన విషయమని.. ఈ అంశం మహిళలకు ఆర్ధిక అడ్డంకులను తొలగిస్తుందని సామాజిక న్యాయ కార్యదర్శి షోనా రాబిసన్ అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ఆధారంగా పీరియడ్ ఉత్పత్తులకు ఎవరూ దూరంగా ఉండకూడదనే తమ ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని ఆమె తెలిపారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!